Shaktikanta Das | బ్యాంకుల పెద్దన్న, దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై నేరుగా ప్రభావం పడనుంది. రుణ గ్రహీతలపై ఎఫెక్ట్ ఉండనుంది. నెలవారీ ఈఎంఐ మరింత పెరగొచ్చు. అలాగే రుణాలు మరింత భారం కానున్నాయి. రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రెపో రేటు పెంపు వల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగనుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది.
ఆర్‌బీఐ రెపో రేటు పెంపు.. బ్యాంక్ కస్టమర్లపై ఎఫెక్ట్!
