ఆ విషయంలో ‘ఏపీ’ నెంబర్ వన్.. జగన్‌కు అభినందనలు: లోకేష్

Yuvagalam: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. అధిక పన్నులను తగ్గించి, నిత్యావసర వస్తువుల ధరలు నేలకు దించుతామని.. ఆ పార్టీ యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎందుకు మోసం చేశారని.. గడప గడపకు కార్యక్రమానికి వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. అయితే.. 12వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా.. లోకేష్ (Nara Lokesh) చిత్తూరు నియోజకవర్గం నడిచారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది.

చిత్తూరు నియోజకవర్గం (Chittoor Constituency)లో లోకేష్ నడుస్తూ.. ఓ పెట్రోల్ బంకు దగ్గర ఆగారు. అక్కడ పెట్రోల్, డీజీల్ ధరలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ ధరలు కనిపించేలా సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘పెట్రోలు, డీజిల్ ధరల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్. జగన్‌కు అభినందనలు’ అని ట్వీట్ చేశారు. లోకేష్ చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు గతంలో జగన్ పెట్రోల్ రేట్ల గురించి మాట్లాడిన వీడియోలను పోస్టు చేస్తున్నారు. లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *