కారం అన్నంతో స్టూడెంట్స్‌ కడుపు మాడ్చిన సిబ్బంది..సర్కారు హాస్టల్‌ తీరుపై కలెక్టర్‌కి లేఖ

(Syed Rafi, News18,Mahabubnagar)

ప్రభుత్వ వసతి గృహాలు, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం అన్న, పౌష్టికాహారంతో కూడిన మెనూని విద్యార్ధులకు వడ్డిస్తున్నారని సర్కారు చెబుతుంటే..పరిస్థితి అందుకు పూర్తి విరుద్దంగా ఉంది. రంగారెడ్డి(Ranga reddy)జిల్లాలోని ఓ వసతి గృహంలో ఉడికి ఉఢకని భోజనం, కారం పొడితో చేసిన స్నాక్స్(Snacks)పెడుతూ విద్యార్ధుల కడుపు మాడుస్తున్నారు. దీంతో ఓ విద్యార్ధిని ఆసుపత్రి(Hospital) పాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారుల అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడి వరకు వెళ్లిందంటే చివరకు ఇలాంటి భోజనం, స్నాక్స్ తినలేక చస్తున్నామంటూ ఓ విద్యార్ధిని జిల్లా కలెక్టర్‌(Collector)కు లేఖ రాసే వరకు వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Inspiring Story: 60ఏళ్ల వృద్దుడికి వచ్చిన అద్భుతమైన ఐడియా .. ఓల్డ్‌ మెన్‌ కాదు వెరీ స్ట్రాంగ్ మెన్

ప్రభుత్వ హాస్టల్‌లో అరాచకం..

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం మొగలిగిద్ద కేజీబీవీ వసతి గృహంలో గత కొంతకాలంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. కారంపూడితోనే కడుపు మాడుస్తూ విద్యార్ధుల అనారోగ్యానికి కారణమవుతున్నారు. వసతి గృహంలో ప్రతిరోజు విద్యార్థులకు కారంపొడి తోనే స్నాక్స్, ఉడికీ ఉడకని అన్నం, నీళ్ళ చారుకు తోడు  సరిపడా కూరగాయలు లేక కారంపొడి పెడుతున్నారని ఓ విద్యార్థిని ఆసుపత్రిపాలై చికిత్స తీసుకుంటోంది.

కారంతో కడుపు మాడుస్తున్న సిబ్బంది..

కస్తుర్బా గాంధీ వసతి గృహంలో ఇంటర్ మీడియాట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రావణి అనే యువతి  జిల్లా కలెక్టర్‌కు ఇదే విషయాన్ని వివరిస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లేఖ రాసింది. హాస్టల్‌లో అనారోగ్యకరమైన భోజనం పెట్టడం కారణంగా కడుపు మంటతో ఆసుపత్రిలో చేరుతున్నట్లుగా విద్యార్ధిని లేఖలో పేర్కొంది. అంతే కాదు కారం పొడితే స్నాక్స్, భోజనం పెడుతున్నప్పటికి సరిపడ మంచినీళ్లు కూడా త్రాగడానికి అందించడం లేదని నానా అవస్థలు పడుతున్నారంటూ విద్యార్థులు ఎవరైనా విద్యార్థులు అడిగితే సిబ్బంది తమపై కక్షగట్టి పనిష్మెంట్ ఇస్తూన్నారని మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. అటుపై కలెక్టర్‌కు లేఖ రాశారు విద్యార్ధులు.

ఎలాగైతే మా పరిస్థితి ఏంటీ..

చదువు కోసం తల్లిదండ్రులకు దూరంగా ఉండి వసతి గృహాల్లో ఉంటున్న తమకు ఇలాంటి భోజనం పెడితే తమ ఆరోగ్యాలు ఏమవుతాయని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి భోజనం చేసి కడుపు మంటతో ఎలా చదువుపై శ్రద్ధ చూపిస్తామంటున్నారు. ప్రభుత్వం చూపించిన మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్‌ను కోరుతూ విద్యార్ధులు లేఖ ద్వారా విన్నవించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *