కియారా పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడింది.. కొత్త జంటకు చరణ్ విషెస్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ చిత్రం ద్వారా టాలీవుడ్‌‌కు ఎంట్రీ ఇచ్చిన బీటౌన్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani). తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan) సరసన రెండో సినిమా చేసిన తను బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే బీటౌన్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), తను కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని తెలిసిందే. మొత్తానికి ఈ లవ్ బర్డ్స్ వివాహం మంగళవారం సాయంత్రం రాజస్థాన్‌లోని సూర్యఘడ్ కోటలో సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అఫిషియల్‌గా షేర్ చేసింది కియారా. ఈ సందర్భంగా రామ్ చరణ్ సిద్ధార్థ్, కియారా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడిందనే కోట్‌తో పాటు వారిద్దరూ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న ఫొటోను జతచేస్తూ పోస్ట్ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. చరణ్ తన పోస్టులో పేర్కొన్నట్లు నిజంగానే ఒకరి కోసమే మరొకరు పుట్టారా? అన్నట్లుగా ఉన్నారు. పెళ్లి వేడుకకు సంబంధించి ఈ జంట ఫొటోలు చూసిన ఎవరికైనా ఇదే ఫీలింగ్ కలుగుతోంది. కియారా అభిమానులతో పంచుకున్న ఫొటోల్లో ఈ కపుల్ నవ్వులు చిందిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. సన్నిహితులు సమక్షంలో ప్రైవేట్‌గా జరిగిన కియారా, సిద్ధార్థ్ పెళ్లి వేడుకకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దాదాపు వందకు పైగా వీవీఐపీలను ఇన్‌వైట్ చేసినట్లు సమాచారం. అలాగే తెలుగులో తనతో కలిసి పనిచేసిన ఇద్దరు నటులు రామ్ చరణ్, మహేష్ బాబులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలిసింది. కియారా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15లో నటిస్తోంది. ఇది రామ్ చరణ్‌‌తో తనకు రెండో సినిమా. ఈ మూవీకి సంబంధించిన ఒక పాట చిత్రీకరించాల్సి ఉంది. కియారా పెళ్లి కారణంగానే వాయిదా పడింది. ఇక సిద్, కియారా వివాహ వేడుకలన్నీ ముగిసిన తర్వాత రూ. 70 కోట్ల విలువైన తమ కొత్త జుహూ మాన్షన్‌కి మారనున్నారు.

Read Latest

Tollywood updates and

Telugu news

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *