గుణదలలో మేరిమాత ఉత్సవాలకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్న గుణదల మేరీమాత ఉత్సవాల ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్నీ పరిశీలించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు విశాల్ గున్నీ వివరించారు.
ఇక, గుణదల మేరీమాత ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 9, 10, 11వ తేదీల్లో విజయవాడ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగే కార్యక్రమంలో లక్షలాది సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే, మేరీమాత ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. విజయవాడ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా వెళ్లే బస్సులను విజయవాడ బస్టాండ్ నుంచి స్వర్ణహోటల్ జంక్షన్ క్రీస్తు రాజపురం, మహానాడు జంక్షన్ మీదుగా రామవరప్పాడు నుంచి ఆటోనగర్ మీదుగా.. గన్నవరం ఆటోనగర్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా బస్ స్టాండ్‌కు వచ్చే బస్సులను మళ్లిస్తారు.
గన్నవరం ఆటో నగర్ మీదుగా రామవరప్పాడు నుంచి మాచవరం పోలీస్ స్టేషన్ మీదుగా బందర్ లాకులు పీసీఆర్ జంక్షన్ మీదుగా బస్‌స్టాండ్‌కు మళ్లించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక, గుణదల మేరీమాత ఉత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం 6 ప్రాంతాలు ఏర్పాటు చేశారు. మధురానగర్ వంతెన వద్ద బీఆర్ టీఎస్ మధ్య రోడ్డు రోడ్డు.. సెయింట్ జోసెఫ్ హైస్కూల్ మైదానం, జియాన్ బైబిల్ కాలేజీ మైదానం, ఈఎస్ఐ ఆసుపత్రి మైదానం, డాక్టర్ వైఎస్సార్ మెడికల్ కాలేజీ మైదానంలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.