చాట్‌జిపిటి రైవెల్‌ పో చాట్‌బాట్‌ను లాంచ్‌ చేసిన Quora.. ఇదెలా పని చేస్తుందంటే?

Quora అనేది నాలెడ్జ్‌ (Knowledge) షేర్‌ చేసుకునేందుకు రూపొందించిన ప్రత్యేక ప్లాట్‌ఫారం. ఇక్కడ ప్రశ్నలు అడగవచ్చు, వివిధ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. వివిధ అంశాల్లో నిపుణులతో కనెక్ట్‌ కావచ్చు. అయితే ప్రస్తుతం Quora కంపెనీ AI చాట్‌బాట్ స్పేస్‌లోకి ప్రవేశించాలని ప్లాన్ చేస్తున్నట్లు CEO ఆడమ్ డి ఏంజెలో ప్రకటించారు. చాట్‌బాట్ పౌ వినియోగదారులు ప్రశ్నలు అడగడానికి, ఇన్‌స్టంట్‌గా సమాధానాలు పొందడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. AIతో సంభాషించడానికి యూజర్లకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

* Quora సేవల్లో ఏఐ చాట్‌బాట్‌

ఇటీవల Quora CEO ఆడమ్ డి ఏంజెలో తన AI- చాట్‌బాట్ ప్లాట్‌ఫారంను ఇంట్రడ్యూస్‌ చేయడానికి సంబంధించి ఓ ట్వీట్‌ చేశారు. అందులో iOS వినియోగదారులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఇన్‌స్టంట్‌గా ప్రశ్నలు అడగవచ్చని చెప్పారు. అంతేకాకుండా అన్ని ప్రధాన ప్లాట్‌ఫారంలకు త్వరలోనే సపోర్ట్‌ అందజేస్తామని వివరించారు. ఈ రోజు పో అనే కొత్త AI ప్రొడక్ట్‌కి పబ్లిక్ యాక్సెస్‌ను ఓపెన్‌ చేస్తున్నామని చెప్పారు.

డి’ఏంజెలో కంపెనీ అనేక బాట్‌లకు సపోర్ట్‌ ఇస్తుందని కూడా ప్రకటించారు. అతని ట్వీట్‌ల ప్రకారం.. పో ప్రధాన లక్ష్యం బాట్ అగ్రిగేటర్‌గా మారడం. ఒకే యాప్ నుంచి విభిన్న టాస్క్‌ల కోసం ఆప్టిమైజ్ చేసిన చాట్‌బాట్‌లను యాక్సెస్ చేయడంలో వినియోగదారులకు సహాయం చేస్తుంది.

ఇది కూడా చదవండి : బెస్ట్‌ 5జీ ఫోన్‌ కొనాలని చూస్తున్నారా? రూ.15 వేలలో లభించే టాప్‌ ఫోన్లపై ఓ లుక్కేయండి!

పో మొదట iOSలో అందుబాటులోకి వచ్చింది. రాబేయే నెలల్లో మరిన్ని బాట్‌లను యాడ్‌ చేయడంతోపాటు, ప్రధాన ప్లాట్‌ఫారంలకు సపోర్ట్‌ యాడ్‌ చేయనున్నట్లు Quora CEO చెప్పారు. Poe గురించి poe.comలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

* వేగంగా అడుగులు వేస్తున్న గూగుల్‌

గూగుల్ కూడా త్వరలో ChatGPT ప్రత్యర్థి బార్డ్‌ను లాంచ్‌ చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ CEO సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌కు AI ఫీచర్లను జోడించాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రయోగాత్మక, వినూత్న మార్గాల్లో సెర్చ్‌ చేయడానికి ఉపయోగపడే సరికొత్త, శక్తివంతమైన సహచరుడితో అతి త్వరలో ప్రజలు నేరుగా సంభాషించే అవకాశం రానుందన్నారు. నాలుగో త్రైమాసికం ఫలితాలు ప్రకటించిన సందర్భంగా సుందర్‌ పిచాయ్‌ ఈ వివరాలు వెల్లడించారు.

గూగుల్‌ కంపెనీ సొంత లాంగ్వేజ్‌ మోడల్‌ అయిన లాంగ్వేజ్‌ మోడల్‌ ఫర్‌ డైలాగ్‌ అప్లికేషన్స్‌ గూగుల్‌ సెర్చ్‌ను ప్రభావితం చేస్తుంది. ఇది వాస్తవ, సంభాషణ క్వెరీ రిజల్ట్స్‌ను అందించడంలో బ్రౌజర్‌కు సహాయం చేస్తుంది. పిచాయ్ ప్రకారం.. రాబోయే వారాలు, నెలల్లో టెస్టింగ్‌ కోసం ఇంప్రూవ్డ్‌ సెర్చింగ్‌ను ప్రవేశపెట్టవచ్చు. మేలో జరగనున్న Google IO 2023 ఈవెంట్‌లో కీలక అప్‌డేట్స్‌ను అందించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *