చాలా ఏళ్లుగా భారత్‌లోనూ చైనా స్పై బెలూన్‌లు.. సైనిక రహస్యాలు చోరీ.. వెలుగులోకి సంచలన విషయాలు

చైనా గూఢచర్య బెలూన్‌‌ను అమెరికా కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో మరో సంచలన విషయం బయటపడింది. కేవలం అమెరికా మాత్రమే కాకుండా.. భారత్, జపాన్‌లను లక్ష్యంగా చేసుకుని గూఢచారి బెలూన్‌లను చైనా ప్రయోగించినట్టు అంతర్జాతీయ మీడియా ఓ కథనాన్ని వెలువరించింది. చైనా దక్షిణ తీరం హైనాన్ ప్రావిన్సుల్లో అనేక సంవత్సరాల నుంచి పాక్షికంగా నిఘా బెలూన్ వ్యవస్థ పనిచేస్తోందని వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం తెలిపింది. జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌ సహా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక దేశాల సైనిక సమాచారాన్ని దీని ద్వారా సేకరించిందని పేర్కొంది.

అనేక మార్గాలు, నిఘా అధికారులను ఇంటర్వ్యూ చేసి సమాచార సేకరించి నివేదికను తయారు చేశామని వెల్లడించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వైమానిక దళం ద్వారా నిర్వహిస్తున్న ఈ నిఘా ఎయిర్‌షిప్‌లు ఐదు ఖండాలలో కనిపించాయని అధికారులు తెలిపారు. పీపుల్స్ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాకు చెందిన నిఘా బెలూన్లు.. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. గత వారం కనిపించినవే కాకుండా.. కొన్నేళ్లుగా కనీసం నాలుగు బెలూన్లు హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గ్వామ్లో ప్రత్యక్షమయ్యాయని ది డైలీ పత్రిక తెలిపింది.

ట్రంప్‌ హయాంలో మూడు నాలుగు సందర్భాల్లో ఇలాంటివి చోటుచేసుకున్నా.. ఇటీవలే వాటిని చైనా నిఘా ఎయిర్‌షిప్‌లుగా గుర్తించినట్లు వెల్లడించారు. కాగా, ఇటీవల తమ గగనతలంలోకి వచ్చిన చైనా నిఘా బెలూన్ను అట్లాంటిక్ తీరంలోని దక్షిణ కరోలినాలో గతవారం కూల్చివేసిన అమెరికా.. వాటి శిథిలాలను సేకరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ విడుదల చేసింది.

Read Latest National News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *