తప్పు చేశానని ఒప్పుకున్న సిరి.. స్టేజిపై ఏడుపు, దగ్గరికి తీసుకుని ఓదార్చిన శ్రీహాన్!

బిగ్‌‌బాస్ సీజన్-5లో సిరి- షన్ను (షణ్ముఖ్) చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫ్రెండ్‌షిప్ పేరుతో వీళ్ల ముద్దులు, హగ్‌లు చూసి ఆడియన్స్‌కు ఒకింత చిరాకొచ్చింది. ఎందుకంటే అప్పటికే సిరికి శ్రీహాన్‌తో ఎంగేజ్‌మెంట్ అయిపోగా.. షన్ను.. దీప్తి సునయనాతో రిలేషన్‌లో ఉన్నాడు. అయినా వాటిని పట్టించుకోకుండా సిరి-షన్ను రెచ్చిపోయారు. చివరికి దానికి ప్రతిఫలంగా షన్నుకు టైటిల్ పాయే.. అలానే బయటకు వచ్చిన తర్వాత దీప్తి కూడా బ్రేకప్ చెప్పేసింది.

ఈ మేటరంతా మాకు తెలుసు గానీ అసలు విషయం ఏంటంటారా? అందరూ ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న ఈ మేటర్‌ను సిరి మరోసారి తవ్వి తీసుకొచ్చింది. స్టేజిపై కన్నీళ్లు కూడా పెట్టుకుంది.

97694555

తప్పు చేశాను

వాలంటైన్స్ డే వస్తుండటంతో ‘స్టార్ మా’ లవ్ టుడే అని ఓ షో చేసింది. దీనికి సిరి-శ్రీహాన్ జోడి కూడా హాజరైంది. ఇందులో భాగంగా రిలీజ్ చేసి ప్రోమోలో షన్ను మేటర్‌పై సిరి ఓపెన్ అయింది. “చిన్నచిన్న తప్పులు అందరూ చేస్తారు.. కానీ స్టేజిపైన ఎవరూ ఒప్పుకోరు.. నేను నిజంగానే నాకు తెలియకుండా.. ఎక్కడో” అంటూ ఎమోషనల్ అయింది. వెంటనే సిరిని దగ్గరికి తీసుకుని శ్రీహాన్ హగ్ చేసుకున్నాడు. అయినా సిరి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది. చివరికు యాంకర్లు రవి, రష్మీ కూడా వచ్చి సిరిని ఓదార్చారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

శ్రీహాన్ గ్రేట్

ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ శ్రీహాన్‌ గురించి కామెంట్లు చేస్తున్నారు. సిరి-షన్ను మేటర్ అంత రచ్చరచ్చయినా శ్రీహన్ చాలా కూల్‌గా ఉన్నాడు. దీప్తి సునయనా తీసుకున్నట్లు బ్రేకప్ లాంటి డెసిషన్లు తీసుకోలేదు. అందుకే “సిరి చాలా లక్కీ, శ్రీహాన్ గ్రేట్, వాళ్ల మధ్య చాలా బాండింగ్ ఉంది, శ్రీహాన్ మంచి వ్యక్తి” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

నిజానికి సిరి, షన్ను హౌస్‌లో ఉన్నప్పుడే వీళ్ల మధ్య ఏదో జరుగుతుందంటూ మిగిలిన కంటెస్టెంట్లు గుసగుసలాడేవారు. హౌస్‌లోకి సిరి అమ్మ వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని గట్టిగానే చెప్పారు. “నువ్వు షన్నుకి దగ్గరవుతున్నావ్.. నాకు ఇది నచ్చలేదు” అంటూ సిరి ముఖంపైనే వాళ్ల అమ్మ చెప్పేసింది. శ్రీహాన్ కూడా “నన్ను వదిలేస్తున్నావా సిరి” అంటూ ఫన్నీగా అడిగాడు. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీహాన్- సిరి జోడి నార్మల్‌గానే ఉంది. లాస్ట్ సీజన్‌లో శ్రీహాన్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు సిరి హౌస్‌లోకి వచ్చిన ఎపిసోడ్ హైలెట్ అయింది. మొత్తానికి అయితే ఇన్నాళ్లకు షన్ను మేటర్‌లో తప్పు చేశానని సిరి ఇండైరెక్ట్‌గా ఒప్పుకుందన్నమాట!

‘లవ్ టుడే’ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *