తుస్సుమన్న హిండెన్‌బర్గ్‌‌.. అదానీకి 3 గంటల్లో రూ.35 వేల కోట్లు.. రిచ్ లిస్ట్‌లో పైపైకి.. !

Adani: అమెరికాకు చెందిన షార్ట్ సేయిలింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ నెగెటివ్ రిపోర్ట్‌తో అదానీ గ్రూప్ భారీగా నష్టపోయింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పడిపోతూ వచ్చాయి. గడిచిన 10 ట్రేడింగ్ రోజుల్లో అదానీ కంపెనీల్లో పెద్ద భూకంపమే సృష్టించింది హిండెన్ బర్గ్ నివేదిక. అదానీ కంపెనీల షేరు ధరలు తగ్గిపోయిన క్రమంలో మార్కెట్ విలువ సైతం సగానికి తగ్గిపోయింది. గౌతమ్ అదానీ సంపద 58 బిలియన్ డాలర్లకు పడిపోయింది. జనవరి 24న మొదలైన తుపాను ఇప్పుడు పక్కదారి పట్టింది. ఫిబ్రవరి 7 మంగళవారం నుంచి అదానీ గ్రూప్ షేర్లలో రికవరీ మొదలైంది. రెండు రోజుల్లోనే అదానీ గ్రూప్ షేర్లు రెండింతలు పెరిగాయి.

ఫిబ్రవరి 8, బుధవారం అదానీ ఎంటర్ ప్రైజెస్ మంచి లాభాలతో ప్రారంభమైంది. ఒక దశలో రూ.1987 స్థాయిని తాకింది. అదానీ కంపెనీల్లోనే దాదాపు అన్ని కంపెనీల షేర్లు దూసుకెళ్లాయి. దీంతో గడిచిన ఈ రెండు రోజుల్లోనే గౌతమ్ అదానీ సంపద 58 బిలియన్ డాలర్ల నుంచి 63.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

టాప్ 20లోకి అదానీ రీఎంట్రీ

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ ప్రతి క్షణం పెరుగుతూనే ఉన్నారు. అదానీ సంపద 63.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవంల 3 గంటల్లోనే 7.31 శాతం పెరిగింది. బుధవారం ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 12.30 గంటల నాటికి అదానీ నెట్ వర్త్ 4.3 బిలియన్ డాలర్లు పెరిగింది. కేవలం కొన్ని గంటల్లోనే అదానీ సంపద రూ. 3,55,46,61,65,000 వృద్ధి చెందింది. ప్రస్తుతం అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 20లోకి ప్రవేశించారు. ప్రస్తుతం 17వ స్థానంలో కొనసాగుతున్నారు. త్వరలోనే మరిన్ని స్థానాలు ఎగబాకుతారనే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అదానీ కంటే ముందు మార్క్ జుకెర్‌బర్గ్ 16వ స్థానంలో కొనసాగుతున్నారు.

అదానీ షేర్ల ర్యాలీ..

గౌతమ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రాకెట్ వేగంతో పరుగులు పెడుతున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లో అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ధర 13 శాతం వృద్ది చెంది రూ.2036 స్థాయిని చేరింది. మరోవైపు.. అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ 5 శాతం లాభంతో రూ.1314కు చేరింది. అదానీ పోర్ట్స్ 7.6 శాతం పెరగగా.. అదానీ గ్రీన్ అండ్ టోటల్ గ్యాస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Read

Business News and Telugu News

Read:

15 శాతం ఉద్యోగులు ఔట్.. సీఈఓ గుడ్‌బై అంటూ భావోద్వేగం!

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *