India vs Australia 1st Test: ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ (Nagpur) వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టులో ఆడబోయే భారత్ తుది జట్టు (India Playing 11)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగ్‌పూర్ పిచ్ స్పిన్‌కి అనుకూలమని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దాంతో ముగ్గురు స్పిన్నర్లతో తుది జట్టుని ఎంపిక చేస్తారా లేదా అదనపు బ్యాటర్‌ని టీమ్‌లోకి తీసుకుంటారా? అనేదానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఆస్ట్రేలియాతో మొత్తం నాలుగు టెస్టులని టీమిండియా ఆడనుండగా.. ఈ సిరీస్‌కి వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నాడు.
నాగ్‌పూర్ టెస్టుకి భారత్ తుది జట్టుపై దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) తాజాగా ఓ హింట్ ఇచ్చాడు. అయితే.. కార్తీక్ ఎంపిక చేసిన తుది జట్టు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లని పక్కన పెట్టిన దినేశ్ కార్తీక్.. తన తుది జట్టులో ఫామ్ కోసం తంటాలు పడుతున్న వారికి అవకాశం ఇచ్చాడు. అయితే.. తుది జట్టుపై ఈరోజు సాయంత్రం కెప్టెన్ రోహిత్ శర్మ అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
తొలి టెస్టుకి దినేశ్ కార్తీక్ ఎంపిక చేసిన భారత్ తుది జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
నాగ్‌పూర్ పిచ్ స్పిన్‌కి అనుకూలమని రికార్డులు చెప్తుండటంతో అశ్విన్, జడేజాతో పాటు అక్షర్ పటేల్‌కి తుది జట్టులో దినేశ్ కార్తీక్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే.. శుభమన్ గిల్‌పై వేటు వేసి సూర్యకుమార్‌కి టీమ్‌లో చోటివ్వడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అలానే వికెట్ కీపర్‌గా తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌ని కార్తీక్ ఎంపిక చేశాడు. అదే నిజమైతే ఇషాన్ కిషన్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితంకానున్నాడు గత కొన్ని నెలలుగా టెస్టు టీమ్‌తో ఉంటున్నా.. కేఎస్ భరత్‌కి ఇంకా అరంగేట్రం ఛాన్స్ దొరకలేదు. భారత్ గడ్డపై టెస్టుల్లో కుల్దీప్ యాదవ్‌కీ మెరుగైన రికార్డ్ ఉంది.
Read Latest
Sports News
,
Cricket News
,