నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

ఏపీ మంత్రివర్గం నేడు సమావేశంకానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ అవుతోంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా జిందాల్‌ స్టీల్‌కు రామాయపట్నం పోర్టులో క్యాప్టివ్‌ బెర్త్‌ కేటాయింపు ప్రతిపాదనలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఆదర్శ పాఠశాలలతోపాటు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎడ్యుకేషన్‌ సొసైటీల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుపై చర్చించనున్నారు. మరికొన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *