Gold Price Today: భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ముఖ్యంగా పండగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయాల్లో మహిళలు బంగారు ఆభరణాలను అలంకరణగా వాడుతుంటారు. ఇదే సమయంలో దీనికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండి.. రేట్లు తక్కువగా ఉంటాయి. అయితే చివరగా దసరా, దీపావళి పండగ సీజన్‌లో బంగారం, వెండి రేట్లు అత్యంత కనిష్టం వద్ద ఉండేవి. కానీ అప్పటినుంచి మళ్లీ పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి. ఇదే సమయంలో రెండేళ్ల గరిష్టాన్ని దాటి ట్రేడయ్యాయి. అయితే ఇటీవల యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన తర్వాత.. మళ్లీ బంగారం, వెండి ధరలు రెండు రోజులు పడిపోయాయి.
2 రోజుల వ్యవధిలో బంగారం రేటు రూ.1200 మేర, సిల్వర్ ఏకంగా రూ.3600 మేర పతనమైంది. కానీ ఇది రెండు రోజులకే పరిమితమైంది. మళ్లీ ఇప్పుడు దేశీయంగా ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా మాత్రం మళ్లీ పడిపోతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1875 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. స్పాట్ సిల్వర్ రేటు మాత్రం 22.17 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ వరుసగా క్షీణిస్తూ.. ప్రస్తుతం రూ.82.940 వద్ద ఉంది.
అదానీ ఇష్యూ ఒక కంపెనీ సమస్య.. భారత్‌పై దాడి కాదు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర తులానికి రూ.100 మేర పెరగ్గా.. ప్రస్తుతం రూ.52,750 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రోజు రూ. 250 మేర పెరిగింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.110 మేర ఎగబాకగా.. రూ.57,550 మార్కును తాకింది. దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 మేర పెరిగి రూ.52,900 వద్ద ఉండగా.. ఇదే 24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే రూ.110 మేర ఎగబాకి.. ప్రస్తుతం రూ.57,700 మార్కును చేరింది.
అంచనాలు తప్పిన అదానీ కంపెనీ.. పడిపోయిన లాభం.. ఆదాయంలో మాత్రం తగ్గేదేలె!
మరోవైపు బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దిల్లీలో కేజీ సిల్వర్ రూ.100 పెరిగి రూ.71,300 వద్ద ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు స్థిరంగా రూ.74 వేల వద్ద ఉంది. అయితే ఇది 4 రోజుల వ్యవధిలో రూ.3800 పడిపోయింది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా ఉండగా.. వెండి రేట్లు మాత్రం తక్కువగా ఉంటాయి.
PF ఖాతాదారులకు అలర్ట్.. ఇవన్నీ అప్‌డేట్ చేశారా? మీ అనుమానాలన్నింటికి సమాధానాలివిగో..!
Read Latest
Business News and Telugu News
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read:
SEBI ఛైర్‌పర్సన్‌ను రెండుసార్లు కలిసిన Gautam Adani.. కారణం అదేనా?
ఐటీ ఉద్యోగులకు అత్యంత చేదు అనుభవం.. 600 మందిని పీకేసిన ఇన్ఫోసిస్..