బిగ్‌బాస్ అన్ని సీజన్ల నుంచి కంటెస్టెంట్లను ఏరికోరి తీసుకుని ‘బీబీ జోడి’ అనే డ్యాన్స్ షోను మొదలెట్టారు. ఏ ముహూర్తాన ఇది స్టార్ట్ చేశారో ఏమో కానీ.. బిగ్‌బాస్ లేక బోర్ కొట్టిన జనాలకు ఇది ఫుల్ ఎంజాయ్‌మెంట్ ఇస్తుంది. అందులోనూ అన్నీ సీజన్లలో తమ ఫెవరెట్ కంటెస్టెంట్లను ఒకే షోలో చూడటం ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తుంది. ఇక షోలో అఖిల్ సార్థక్- కౌశల్ మధ్య రగడ మామూలుగా లేదు. మధ్యమధ్యలో కౌశల్- ఫైమా మధ్య కూడా డైలాగ్ వార్ నడుస్తుంది. షో మంచి రసవత్తరంగా సాగుతున్న వేళ కౌశల్.. సడెన్‌గా వైజాగ్ వెళ్లిపోయాడు. దీంతో ఏమైందోనని ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు.
రిహార్సల్స్ వదిలేసి
శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ‘బీబీ జోడి’లో తన పెర్ఫామెన్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు బిగ్ బాస్- సీజన్ 2 విన్నర్ కౌశల్. అయితే తన డ్యాన్స్ రిహార్సల్స్‌ను వదిలేసి తన సొంతూరు విశాఖపట్నం వెళ్లిపోయాడు కౌశల్. తన తండ్రితో కలిసి మార్నింగ్ వాక్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ బీబీ జోడి రిహార్సల్స్ గురించి అడిగారు.
తన సిస్టర్ గృహ ప్రవేశం ఉండటంతో వైజాగ్ రావాల్సి వచ్చిందన కౌశల్ ఫ్యాన్స్‌కు చెప్పాడు. ఇది తనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఇది అయిన తర్వాత మళ్లీ బీబీ జోడికి వెళ్తానని చెప్పుకొచ్చాడు.
97491761
పంచాయతీలు
కొరియోగ్రాఫర్ స్పెషల్ రౌండ్‌కు సంబంధించిన ప్రోమో ఈ మధ్య రిలీజైంది. ఇందులో కౌశల్- అభినయశ్రీ పెర్ఫామెన్స్ కనిపించలేదు. అయితే కౌశల్- ఫైమా మధ్య మాత్రం ఎప్పటిలానే డైలాగ్ వార్ పేలింది. కౌశల్-అభినయ శ్రీ జోడి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా ఈషోలో చేరారు. షోలో కౌశల్ ఇప్పటికే తన కో కంటెస్టెంట్స్ అఖిల్ సార్థక్‌తో తెగ గొడవపడుతున్నాడు.
కౌశల్ చాలా కాలంగా టీవీ ఇండస్ట్రీలో ఉన్నాడు. అయితే హీరో నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో తన ప్రదర్శనతో దాదాపు ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యాడు. మరోవైపు అభినయశ్రీకి నటిగా, కొరియోగ్రాఫర్‌గా మంచి ఫేమ్ ఉంది. ఆమె కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో మెరిసింది.
అక్కినేని నాగార్జున ప్రత్యేక అతిథిగా.. ఆరు జోడిలతో ఈ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అయితే ఆషూ రెడ్డి ఇటీవలే షో నుంచి వెళ్లిపోయింది. దీంతో బిగ్‌బాస్- 6 ఫేమ్ శ్రీ సత్య ఆమె స్థానంలో మెహబూబ్‌కు జోడీగా ఎంటరైంది.
Read latest TV News and Movie Updates