‘మోదీ బ్లూ జాకెట్’ గురించే దేశమంతా చర్చ.. ట్రూ లీడర్ అని ఇందుకే అంటారేమో?!

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచమంతా ఎంత ఫాలోయింగ్ ఉందో.. ఆయన వేసుకునే డ్రెస్సింగ్ కూడా అంతే ఫేమస్. దేశమంతా ఆయన లీడర్‌షిప్ గురించే ఎంతగా మాట్లాడుకుంటారో… ఆయన వేషాధారణ గురించి అంతకంటే ఎక్కువగా చర్చించటం విశేషం. మోదీ డ్రెస్సింగ్‌ను సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఫాలో అవుతుండటం విశేషం. అయితే.. మోదీ ఎక్కడికి వెళ్లినా.. ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు.. ఆయన వేషాధారణ ఎలా ఉంది అనే దానిపై కూడా చర్చ జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే.. ప్రధాని మోదీ ఈరోజు పార్లమెంట్ సమావేశాలకు విచ్చేశారు. అయితే.. ఆయన నీలం రంగు (Light Blue Colour) జాకెట్ ధరించి సమావేశాలకు హాజరయ్యారు. చూడటానికి సాధారణంగానే ఉన్న.. ఆ జాకెట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఆ జాకేట్ అన్నింటిలా దారంతో నేసింది కాదు.. ప్లాస్టిక్ బాటిళ్లలతో తయారు చేసింది. నమ్మకం కలగట్లేదా.. నిజమేనండి బాబు. 28.. సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ బాటిల్స్‌ని రిసైకిల్ చేసి ఈ బ్లూ జాకెట్‌ను తయారు చేశారు.

ఫిబ్రవరి 6న బెంగళూరు వేదికగా జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనగా.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ సంస్థ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. 28 పెట్ బాటిళ్లను రీసైకిల్‌ చేసి తయారు చేసిన బ్లూ కలర్ జాకెట్‌ను మోదీకి గిఫ్ట్గా ఇచ్చింది. అయితే.. ఆ జాకెట్‌నే ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు ఈరోజు వేసుకుని వచ్చారు. ఇదిలా ఉంటే.. రాబోయే మూడు నెలల్లో ఈ బ్లూ కలర్ జాకెట్లు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తీసుకువస్తామని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ ఛైర్మన్ తెలిపారు.

మార్కెట్‌లో మోదీ డ్రెస్సులకు భారీ డిమాండ్ కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇలా కార్యాక్రమం ఏదైనా.. అక్కడ మోదీ కోట్లతో చాలా మంది దర్శనమివ్వటం సర్వసాధారణంగా మారిపోయింది. ఆయన వేసుకునే డ్రెస్సింగ్ గురించి నేషనల్ మీడియాలో చర్చ జిరగిందంటే… ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఆయన వేసుకునే డ్రెస్సులను అప్పుడప్పుడు వేలం కూడా వేస్తున్న విషయం తెలిసిందే.

97730898

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *