వడ్డీ రేట్లు పెంచిన ఆర్‌బీఐ.. ఇది మీ లోన్ ఈఎంఐలపై ఎలా ప్రభావం చూపుతుందంటే?

Loan EMI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను బుధవారం ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే మరోసారి రెపో రేటును పెంచింది. అయితే గతంతో పోలిస్తే ఈసారి కాస్త నెమ్మదించింది. గత డిసెంబర్‌లో రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచగా.. ఈసారి మాత్రం 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో మొత్తం రెపో రేటు శ్రేణి 6.50 శాతానికి చేరింది. పెంచిన వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్.

అయితే ఇప్పుడు RBI రెపో రేటును పెంచిన నేపథ్యంలో ఆయా బ్యాంకులు నేరుగా ఈ ప్రభావాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తాయి. రెపో రేటు అంటే.. ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ. దీంతో బ్యాంకులకు ఇకపై RBI కి ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. దీంతో.. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచగానే బ్యాంకులు అన్ని రకాల రిటైల్ లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతాయి. దీంతో పర్సనల్, హోం, వెహికిల్ లోన్లు వంటివి మరింత భారం కానున్నాయి. ఇది సామాన్యులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. నెలవారీ ఈఎంఐలు పెరుగుతాయి. దీంతో ఆర్‌బీఐ వడ్డీ పెంపుతో సామాన్యులపై ఏ ప్రభావం పడుతుందో కచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం.

సామాన్యులపై మళ్లీ ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లు పెంచిన ఆర్‌బీఐ.. ఎక్కువ కట్టాల్సిందే!

బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచితే గనుక అది కొత్తగా లోన్లు తీసుకునేవారికి, బ్యాంక్ డిపాజిట్ దారులకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. వారు ఎక్కువ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు తర్వాత బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచితే గనుక.. ఇప్పటికే లోన్లు తీసుకున్నవారికి EMI పెరగడానికి బదులు.. కాలవ్యవధిని పెంచుతాయి. అంటే.. ఎక్కువ నెలలు ఈఎంఐ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.

సాధారణంగా ఆయా రిటైల్ లోన్లపై వడ్డీ రేట్లను పెంచే బ్యాంకులు.. అదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇది బ్యాంకులో డబ్బులు దాచుకునేవారికి ప్రయోజనం కలిగిస్తుంది. ఎక్కువ వడ్డీ కోసం.. బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేవారి సంఖ్య పెరుగుతుంది.

అదానీతో సంబంధం.. లండన్‌లో ఆ కంపెనీలపై బ్రిటన్ నిఘాసంస్థల దృష్టి..

గత డిసెంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచగా.. అంతకుముందు వరుసగా మూడు సార్లు 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. అంతకుముందు 40 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు కలుపుకొని మొత్తం గతేడాది మే నుంచి చూస్తే ఏకంగా 250 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచడం గమనార్హం. దీంతో అప్పుడు మొత్తం రెపో రేటు 4 శాతంగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా 6.50 శాతానికి చేరింది.

పెరుగుతున్న బంగారం ధరలు.. ఇప్పుడు కొనొచ్చా? హైదరాబాద్‌లో ఇవాళ్టి రేట్లు ఇవే..

Read Latest

Business News and Telugu News

Also Read:

15 శాతం ఉద్యోగులకు లేఆఫ్.. వాళ్ల కోసం అన్నీ వదులుకున్న సీఈఓ.. గుడ్‌బై అంటూ భావోద్వేగం!

వాట్సాప్‌లోనే సింపుల్‌గా Home Loan అప్లై చేసుకోండిలా.. బంపర్ ఆఫర్..

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *