అదృష్టం మనిషి జీవితాన్ని ఎంతగా మార్చగలదంటే.. కూటికి లేని వాన్ని కూడా ఒక్క రోజులో కుభేరున్ని చేయగలదు. ప్రస్తుతం లోకాన్ని ఆడిస్తోంది డబ్బు అనేది జగమెరిగిన సత్యమైతే.. ఆ డబ్బు వర్షం మనపై కురవాలంటే మాత్రం అదృష్టం ఉండాలన్న మాట కూడా అంతే నిజం. ఎంత కష్టపడినా రాత్రికి రాత్రే కోటీశ్వరులమైతే కాలేం కదా. అదే అదృష్టముంటే మాత్రం అవ్వొచ్చు బ్రదర్. ఎలా అంటారా.. ఈ మధ్య లాటరీలు తగిలి రాత్రికి రాత్రే చాలా మంది కోటీశ్వరులవుతున్న వార్తలు వింటున్నాం.. చూస్తున్నాం. అచ్చం అలాంటి నమ్మశక్యం కానీ ఆసక్తికర ఘటన ఇంకోటి జరిగింది. కానీ.. ఈ సారి ఆ వ్యక్తికి అదృష్టం గ్రాముల్లోనో కిలోల్లోనో కాదు.. టన్నుల కొద్దీ పట్టింది. కేవలం 18 ఏళ్ల వయసున్న అమ్మాయికి ఏకంగా 290 కోట్ల లాటరీ తగిలిందంటే.. దాన్ని అదృష్టం అనాలా.. అంతకు మించి ఇంకేమైనా పదం ఉంటుందా.. మీరే చెప్పండి. నమ్మలేకపోతున్నారా.. అయితే.. అర్జెంటుగా విమానమేసుకుని కెనడాలోని అంటారియోకు వెళ్లి జూలియట్ లామర్‌ను కలవాల్సిందే. తన జీవితం ఒక్క రోజులో ఎంతగా మారిపోయిందో కళ్లారా చూస్తే మీకే అర్థమవుతుంది.
కెనడాలోని అంటారియోకు చెందిన జూలియట్ లామర్ జీవితాన్ని తన 18వ పుట్టిన రోజు ఎంతగా మార్చేసిందంటే.. నెవ్వర్ బిపోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేంతగా తన లైఫ్ ఛేంజ్ అయ్యింది. అయితే.. జూలియట్.. తన 18వ పుట్టిన రోజు సందర్భంగా గుర్తుండిపోయేలా ప్రత్యేకమైనదేదైనా కొందామని దగ్గర్లోని ఓ స్టోర్‌కి వెళ్లింది. అయితే తనతో పాటు తాతయ్యను కూడా తీసుకెళ్లింది. అయితే.. జూలియట్ మాత్రం ఏం కొనాలో తెలియక అయోమయంలో పడిపోయింది. తన మనవరాలి అయోమయాన్ని గమనించిన తాతయ్య.. ఏదో ఎందుకు ఓ లాటరీ టికెట్ కొనమని సలహా ఇచ్చాడు. అప్పుడు ఆమెకు తెలియదు.. ఆ సలహా తన జీవితాన్నే మార్చేయబోతోందని. అయితే.. తాత చెప్పినట్టు ఆయన సహాయంతోనే ఓ లాటరీ టికెట్ కొనేసింది జూలియట్. అంటారియో లాటరీ అండ్ గేమింగ్ కార్పోరేషన్‌కు చెందిన లోటో 6-49 లాటరీ టికెట్ కొని.. అక్కడి నుంచి ఇంటికెళ్లిపోయింది.
ఇక ఆ తర్వాత జూలియట్.. ఆ లాటరీ టికెట్ గురించి పూర్తిగా మర్చిపోయింది. కానీ.. జనవరి 7న తన పొరుగింటి వాళ్లకు లాటరీలో ఫ్రైజ్ వచ్చిందని సంతోష పడుతుంటే.. తన దగ్గర కూడా ఓ లాటరీ టికెట్ ఉందన్న విషయం గుర్తుకొచ్చింది. వెంటనే వెళ్లి అందుకు సంబంధించిన యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంది. అందులో చూసి.. షాక్‌తో నిర్ఘాంతపోయింది. ఎందుకంటే.. ఆ 18 ఏళ్ల అమ్మాయి గెలుచుకుంది అక్షరాలా 290 కోట్ల రూపాయలు.
కాసేపటికి ఆ షాక్ నుంచి తేరుకుని.. తాను చూసింది నిజమేనా కాదా అని ఒకటి నాలుగు సార్లు చెక్ చేసుకుంది. అది నిజమేనని నిర్ధారించుకుని.. తన పట్టలేని ఆనందాన్ని కుటుంబసభ్యులతో పంచుకుంది. వాళ్లు కూడా ఆ వార్త విని ఉబ్బితబ్బిబ్బైపోయారు. గాల్లో తేలియాడారు. కేరింతలు కొట్టారు. వాళ్ల ఆనందానికి అవధులే లేవు. ఒక్క లాటరీతో వాళ్ల జీవితాలే మారిపోయాయి. రాత్రికి రాత్రే కుభేరులవటం అంటే ఇదేనేమో.
అయితే.. ఆ గెలుచుకున్న లాటరీ డబ్బులతో జూలియట్.. ఫ్యామిలీ కోసం 2 కోట్ల విలువ ఉన్న మెర్సిరెస్ బెంజ్ కార్లు ఐదు కొనుగోలు చేసింది. అంతే కాదండోయ్.. 100 కోట్లు పెట్టి చార్టర్ విమానమే కొని పడేసింది. మరో 40 కోట్లతో లండన్‌లో విలాసవంతమైన ఇల్లు కొనుక్కుంది. అయితే.. ఆ తెలివైన అమ్మాయి.. మొత్తం డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెట్టకుండా తన భవిష్యత్తు కోసం 150 కోట్లు దాచుకుంది. కాగా.. డాక్టర్ కావాలన్నది జూలియట్ లక్ష్యం. మిగతా డబ్బును తన తండ్రి సూచనలు, సలహాల మేరకు ఇన్వె్స్ట్ చేస్తానని చెప్పింది ఆ లక్కీ గర్ల్.
97702328
Read More Telangana News And Telugu News