Best time to Tea : టీ.. చాలా మంది ఫేవరేట్ డ్రింక్ దీని రుచి చూసేందుకు చాలా మంది ఇష్టపడతారు. వేడి వేడి టీ పడితే కానీ, చాలా మంది పని ముందుకెళ్ళదు. మరి అలాంటి టీ ఏ టైమ్‌లో తాగితే మంచిదో చూద్దాం.
చాయ్ ఇండియాలో మోస్ట్ పాపులర్ డ్రింక్. ఎన్ని హెల్దీ డ్రింక్స్ వచ్చినా.. ఈ చాయ్‌కి ఉండే క్రేజే వేరు. కొంతమంది మార్నింగ్ లేవగానే తాగితే.. మరికొంతమంది టిఫిన్ చేశాక, ఈవెనింగ్ తాగుతారు. చాలా మంది ఏ సమయంలోనైనా తాగుతారు. ఒత్తిడితో ఉన్న రోజులో ఈ ఒక్క డ్రింక్ ఆ ఒత్తిడిని అలా దూరం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఏ టైమ్‌లో టీ తాగితే మంచిదో నిపుణులు కొన్ని విషయాలు షేర్ చసుకుంటున్నారు. అవేంటో చూద్దాం.
టీతో లాభాలు..
అలసిన శరీరానికైనా, మంచి ఎనర్జీ ఇచ్చేందుకైనా టీ ముందు వరుసలో ఉంటుంది. ఎప్పుడైనా మూడ్ బాలేనప్పుడు కప్పు టీ తాగి చూడండి. అప్పటికప్పుడు సెట్ అయిపోతుంది. టీ తాగడం వల్ల నిశబ్ధంగా బాడీ ఒక్కసారిగా సెట్ అయిపోయినట్టు ఉంటుంది.
Also Read : Vitamin D : విటమిన్ డి లోపంతో ఏమేం సమస్యలు వస్తాయంటే..
నిపుణులు ఏమంటున్నారంటే..
టీ తాగే సమయం గురించి ఆయుర్వేద నిపుణురాలు దీక్షా భావ్‌సర్ సావలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆమె ప్రకారం నిద్రకి 10 గంటల ముందు, సాయంత్రం టీ తాగకపోవడం మంచిదని చెబుతున్నారు. టీలోని కెఫిన్ వల్ల నిద్రసమస్యలు వస్తాయని ఆమె చెబుతున్నారు.
టీకి ఓ టైమ్..
అంటే.. ప్రతి పనికి ఓ టైమ్ ఉన్నట్లు టీ తాగడానికి కూడా ఓ ప్రత్యేకమైన టైమ్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా అందరూ ఉదయం, సాయంత్రం తాగుతారు. కానీ, కొన్నిసార్లు సాయంత్రం తాగడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నార నిపుణులు.
Also Read : Vitamin D : విటమిన్ డి లోపంతో ఏమేం సమస్యలు వస్తాయంటే..
న్యూట్రిషనిస్టుల ప్రకారం..
టీ మంచిదే అయినప్పటికీ, దానిని తయారీ విధానం, తాగే సమయం అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరమని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు. వీరి ప్రకారం బ్లాక్ టీ చాలా మంచిది. అయితే, ఇందులో పాలు, షుగర్ కలపడం వల్లే ఇందులోని పోషకాలు తగ్గుతున్నాయని చెబుతున్నారు నిపుణులు.
Also Read : Push-ups : పుషప్స్ ఇలా చేస్తే మీ బాడీకి అస్సలు మంచిది కాదు..
సాయంత్రం ఎవరు తాగొచ్చొంటే..
గ్యాస్, అసిడిటీ లేని వారు
జీర్ణ సమస్యలు లేని వారు.
నిద్ర సమస్యలు లేని వారు
కరెక్ట్ టైమ్‌కి భోజనం చేసేవారు
తక్కువగా తాగేవారు.
నిపుణుల ప్రకారం వీరంతా సాయంత్రం టీ తాగొచ్చు
ఎవరు తాగొద్దొంటే..
నిద్ర సమస్యలు ఉన్నవారు.
ఒత్తిడితో బాధపడేవారు
చర్మ, జుట్టు సమస్యలున్నవారు
జీర్ణ సమస్యలు ఉన్నవారు
తక్కువ బరువు ఉన్నవారు
వీరంతా తాగకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ మార్పులు తప్పనిసరి..
ఒకవేళ కచ్చితంగా టీ తాగాలనుకుంటే
పాలు కలిపాక ఎక్కువగా టీ మరుగనివ్వొద్దు.
సాయంత్రం కంటే కాస్తా ముందుగానే తాగాలి.
బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక తాగడం బెస్ట్ అని చెబుతున్నారు నిపుణులు.
చివరిగా..
మొత్తానికీ, టీ మంచిదే కానీ, దానిని తయారీ విధానం, తాగే సమయంలో మార్పు చేసుకున్నప్పుడే ఈ డ్రింక్ పాజిటీవ్ రిజల్ట్స్‌ని చూపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.