Carrot for hair growth: పొడవాటి జుట్టు కోసం.. క్యారెట్‌ నూనె ఇలా అప్లై చేయండి..!

Carrot for hair growth:  క్యారెట్‌ను మన డైట్‌లో తరచుగా తీసుకుంటే.. హెయిర్‌ ఫాల్‌ దూరం అవుతుందని, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్, జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మీ హెయిర్‌ కేర్‌ రొటీన్‌లో క్యారెట్‌, క్యారెట్‌ ఆయిల్‌ను ఎలా యాడ్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Carrot for hair growth: క్యారెట్‌.. దీన్ని సూపర్‌ ఫుడ్‌ అనొచ్చు. క్యారెట్ తిన్నా, దాని జ్యూస్‌ తాగినా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. క్యారెట్‌ తరచుగా తీసుకుంటే.. డయాబెటిస్‌ ముప్పు తగ్గుతుంది. దీనిలో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం గుండె, మెదడు, మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. క్యారెట్‌లోని పోషకాలు.. మీ ఆరోగ్యానికే కాదు.. కేశ సంరక్షణకూ సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్‌ జుట్టు పెరుగదలను ప్రేరేపిస్తుంది, హెయిర్‌ ఫాల్‌ దూరం చేస్తుంది. క్యారెట్‌లో విటమిన్‌ ఏ, కె, సీ, బి6, బి1, బి3, బి2, ఫైబర్‌, పొటాషియం, ఫాస్పరస్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టును ఆరోగ్యాంగా ఉంచుతాయి. క్యారెట్‌లోని విటమిన్‌ ఏ, ఇ జుట్టు మూలలను బలంగా ఉంచుతాయి, స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పోషకాలు జుట్టు రాలడం, చివర్ల చిట్టిపోవడం వంటి సమస్యలను నివారిస్తాయి. క్యారెట్‌ను మన డైట్‌లో తరచుగా తీసుకుంటే.. హెయిర్‌ ఫాల్‌ దూరం అవుతుందని, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్, జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మీ హెయిర్‌ కేర్‌ రొటీన్‌లో క్యారెట్‌, క్యారెట్‌ ఆయిల్‌ను ఎలా యాడ్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పట్టులాంటి జుట్టు కోసం..

క్యారెట్ – 1

ఆలివ్ నూనె – 250 ml

మీడియం సైజ్‌ క్యారెట్‌ తీసుకుని తురుముకోవాలి. క్యారెట్ తురమును సీసాలో వేసి.. అందులో ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. ఈ బాటిల్‌కు మూతపెట్టి.. ఒక వారం రోజుల పాటు.. చీకటి గదిలో ఉంచండి. ఒక వారం తర్వాత, సీసాలోని నూనె నారింజ రంగులోకి మారుతుంది. దీన్ని వడపోసి మరో సీసాలో స్టోర్‌ చేసుకోండి. ఈ నూనెను మీ తలకు, జుట్టుకు పట్టించి అరగంట తర్వాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేస్తే.. జుట్టు ఒత్తుగు ఎదుగుతుంది, జుట్టు రాలడం, స్లిట్‌ ఎండ్స్‌ వంటి సమస్యలు దూరం అవుతాయి. ఈ ఆయిల్‌ వాడితే.. చుండ్రు, జుట్టు పొడిబారడం వంటి సమస్యలూ పరిష్కారం అవుతాయి. జుట్టును హైడ్రేటెడ్‌గా, షైనీగా ఉంచుతుంది.

అవకాడో క్యారెట్‌ ప్యాక్‌..

అవకాడో – 1

క్యారెట్ – 1

తేనె – 1 చెంచా

ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు

అవకాడో, క్యారెట్‌ తొక్క తీసి.. ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దలో ఆలివ్‌ ఆయిల్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె వేసి పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్‌ను తలకు అప్లై చేసి పాటు గంట సేపు ఆరనీవండి. ఆ తర్వాత మైల్డ్‌ షాంపుతో తలస్నాం చేయండి. మంచి రిజల్టస్‌ కోసం నెలకు కనీసం రెండు సార్లు ఈ హెయిర్‌ మాస్క్‌ను ఉపయోగించండి.

ఈ హెయిర్ మాస్క్ మీ జట్టును మృదుగా, బలంగా మారుస్తాయి. అవోకాడోలోని యాంటీఆక్సిడెంట్లు దెబ్బతిన్న జుట్టును రిపేర్‌ చేస్తాయి. ఈ ప్యాక్‌లోని తేనె జుట్టుకు తేమను అందిస్తుంది. ఆయివ్‌ ఆయిల్‌ జుట్టు మెరిసేలా చేస్తుంది. (Image source – Pixabay)

క్యారెట్‌ ఆయిల్‌..

కొబ్బరి నూనె

క్యారెట్ – 2

రెండు క్యారెట్లు తీసుకుని బాగా తురుముకోవాలి. మీడియం మంట మీద.. కొబ్బరి నూనెను వేడి చేయండి. ఆ తర్వాత.. క్యారెట్‌ తురుము దాలిలో వేసి పదినిమిషాలు కలపాలి. క్యారెట్‌లోని సారం నూనెలోకి వెళ్లే వరకు మరిగించాలి. ఈ నూనె చల్లారిన తర్వాత.. గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఈ సీసాను మూడు రోజులు చీకటి గదిలో ఉంచండి. 3 రోజుల తర్వాత వడగట్టి సీసాలో స్టోర్‌ చేసుకోండి.

ఎలా వాడాలి..?

ఈ నూనెను తలకు అప్లై చేసి.. అరగంట పాటు మసాజ్‌ చేయండి. గంట తర్వాత.. మైల్డ్‌ షాంపుతో తలస్నానం చేయండి. ఈ నూనెను వారానిడి మూడు సార్లు తలకు అప్లై చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. కొబ్బరి నూనె జుట్టు మూలల్లోకి చొచ్చుకొనిపోయి.. డీప్‌ కండీషనర్‌గా పనిచేస్తుంది. (Image source – Pixabay)

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *