Chocolate Day 2023 : లవ్ చేసిన వారికి చాక్లెట్స్ ఎందుకివ్వాలంటే..

Chocolate Day 2023 : చాక్లెట్స్.. ఈ పేరు చెబితే చాలు చిన్నపిల్లలే కాదు.. పెద్దలు కూడా చిన్నపిల్లలు అవుతారు. వాటి రుచి అలాంటిది. మరి ఆ చాక్లెట్స్‌ లవర్స్ విషయంలోనూ ఎందుకంత ఇంపార్టెంట్. ఆ విషయాలే తెలుసుకుందాం.

వాలెంటైన్ వీక్‌లో చాక్లెట్స్‌కి ఓ రోజు ఉంది. ఈ వీక్‌లో వచ్చే మూడో రోజునే చాక్లెట్‌ డేగా జరుపుకుంటారు. మార్కెట్లో ఎన్ని తినే వస్తువులు వచ్చి ప్రతి ఒక్కరూ మాత్రం ముందుగా చాక్లెట్స్ వైపే మొగ్గు చూపుతారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రేమగా కలవాలంటే వారికి చాక్లెట్స్ ఇచ్చి తమ ప్రేమని తెలియజేస్తారు. ఇక లవర్స్ విషయంలో చెప్పాల్సిన పనే లేదు. కచ్చితంగా వాళ్ళ లవ్ జర్నీలో చాక్లెట్స్ ఉండి తీరాల్సిందే. అసలు ఎందుకు ఇవ్వాలి చాక్లెట్స్ ఇప్పుడు చూద్దాం.

ప్రేమ పలకరింపుగా..

సాధారణంగా ఎప్పుడైనా ప్రియురాలిని పలకరించేందుకు వెళ్ళే ప్రియుడు తన కోసం చక్కని చాక్లెట్ తీసుకెళ్తాడు. దానిని చూసిన ప్రియురాలి ఆనందానికి హద్దే ఉండదు. ఇది స్మాల్ అండ్ స్వీటెస్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఎన్నో తీపి పదార్థాలున్నా చాక్లెట్స్‌కి ఉన్న క్రేజే వేరు.

అందరికీ అందుబాటులో..

చాక్లెట్స్ సన్నిహితులకి ఇవ్వడంలో మరో ముఖ్య కారణం.. అందరికీ అందుబాటులో ఉంటాయి. చిన్న బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకూ ఉంటాయి. పైగా వీటిని క్యారీ చేసేందుకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. స్వీట్స్, ఇతర ఏ పదార్థాలనైనా పెద్ద ప్యాకింగ్ అవసరం. వీటికి అదంతా ఏం అవసరం లేదు. ఎలా అయినా ఇవ్వొచ్చు. ఎలా అయినా క్యారీ చేయొచ్చు.

రుచికి సాటి లేదుగా..

నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ చాక్లెట్స్‌ రుచి ఎవరు మాత్రం పడిపోరు చెప్పండి. అందుకే తియ్యని వేడుకకి సరైన జోడి ఈ చాక్లెట్స్. అందుకే వీటిని ఎక్కువగా ప్రేమ చిహ్నంగా ఇస్తారు.

Also Read : Vitamin D : విటమిన్ డి లోపంతో ఏమేం సమస్యలు వస్తాయంటే..

ప్రియురాలి అలక తీర్చేందుకు..

అవును అలిగిన సమయాల్లో ప్రియురాళ్ళని కూల్ చేయడానికి ఇంతకంటే మంచి ఆప్షన్ ఉంటుందా చెప్పండి. అందుకే వారికి ఇష్టమైన ఓ చాక్లెట్ ఇవ్వండి. అలక మాయమై.. బేబి నువ్వు తిను అంటూ మీకో బైట్ కూడా అందుతుందండి.

మూడ్ మారడం..

అవును.. చాక్లెట్స్‌లో కొన్ని గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల బాధతో ఉన్న మనసు ఒక్కసారిగా ఆనందంతో నిండి పోతుందని చెబుతారు. అందుకే వీటిని తినడం మంచిదని చెబుతున్నారు.

Also Read : Push-ups : పుషప్స్ ఇలా చేస్తే మీ బాడీకి అస్సలు మంచిది కాదు..

హృదయానికి మంచిదే..

ఇన్ని చేసే చాక్లెట్స్ హెల్త్‌కి కూడా శ్రీరామ రక్ష అని చెబుతున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల రక్తపోటు తగ్గు, రక్త ప్రసరణ పెరుగుతుంది. గుండె జబ్బులు కూడా చాలా వరకూ తగ్గుతాయి. వీటిని తినడం వల్ల స్కిన్ మెరుగ్గా మారుతుంది.

మొత్తానికీ..

ఇన్ని తెలిశాక మీ ప్రియాతి ప్రియమైనవారికి ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా ఉండలేరని అనుకుంటూ అందరికీ హ్యాపీ చాక్లెట్ డే.. చక్కగా సెలబ్రేట్ చేసుకోండి.

Also Read : Cough causes : ఆగకుండా దగ్గు వస్తుందా.. జాగ్రత్త..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *