Dwijapriya Sankashti Chaturthi 2023 హిందూ మత విశ్వాసాల ప్రకారం, సంకష్ఠ చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో 9 ఫిబ్రవరి 2023న గురువారం రోజున ద్విజప్రియ సంకష్ఠ చతుర్థి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున వినాయకుడి ఆరో రూపమైన ద్విజప్రియ వినాయకుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, సంతోషం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ద్విజప్రియ సంకష్ఠి చతుర్థి కథ, శుభ ముహుర్తం, ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
శుభ ముహుర్తం..
మాఘ మాసంలోని క్రిష్ణ పక్షంలో సంకష్ఠ చతుర్థి తేదీ 09 ఫిబ్రవరి 2023న గురువారం ఉదయం 6:23 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 10 ఫిబ్రవరి 2023 ఉదయం 7:58 గంటలకు ముగుస్తుంది. చంద్రోదయ సమయం 9:25 గంటలకు ప్రారంభమవుతుంది.
Mahashivratri 2023 శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాల విశిష్టతలేంటి.. శివస్వాములకు, సాధారణ భక్తులకు మల్లన్న స్వామి దర్శనమెప్పుడంటే…!
ద్విజప్రియ సంకష్ఠి చతుర్థి కథ..
హిందూ పురాణాల ప్రకారం, ఒకప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ దేవిలు చౌపద్ ఆట ప్రారంభిస్తారు. ఆ సమయంలో వీరి ఆటకు ఎవరూ న్యాయాధిపతిగా ఉండరు. ఈ సమస్యను ఓ కొలిక్కి తేవడానికి శివపార్వతులు కలిసి ఓ మట్టి విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహానికి ప్రాణం పోశారు. తామిద్దరం ఆడే ఆటలో ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడిపోతారో నిర్ణయించమని ఆ మట్టితో చేసిన పిల్లాడికి చెబుతారు.
ఆ తర్వాత శివపార్వతుల మధ్య చౌపద ఆట మొదలైంది. అప్పుడు ప్రతిసారీ అమ్మవారు పరమేశ్వరుడిని ఓడించి తను విజయఢంకా మోగించింది. అయితే పార్వతీ దేవి ఓడిపోయినట్లు బాలుడు చెప్పడంతో అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. దీంతో ఆగ్రహంలో తనకు వికలాంగుడు కావాలని శాపం విధిస్తుంది. తన తప్పుకు ఆ బిడ్డ ఎన్నిసార్లు క్షమించమని వేడుకున్నా ఆ శాపం వెనక్కి తీసుకోలేనని కరాఖండిగా చెప్పింది.
అయితే పార్వతీ దేవి ఆ పిల్లాడికి శాప విముక్తికి మార్గం చెప్పింది. మాఘ మాసంలోని క్రిష్ణ పక్షంలో వచ్చే సంకష్ఠ చతుర్థి నాడు వినాయకుడి ఉభయ రూపాలను ప్రత్యేకంగా ఆరాధించాలని చెప్పింది. అప్పుడు ఆ పిల్లాడు బాల గణేశుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాడు. ఆ తర్వాత బాలుడు శాపం నుంచి విముక్తి పొందాడు. ఆ తర్వాత తన వికలాంగత్వం తొలగిపోతుంది. అప్పటి నుంచి తన జీవితం సాధారణ స్థితికి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా సంకష్ఠ చతుర్థి రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.
గమనిక
: ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Read
Latest Religion News
and