E20 Fuel: E20 అంటే ఏంటి? ఈ పెట్రోల్‌తో మనకేం లాభం? వాహనాలపై ఎలాంటి ప్రభావముంటుంది?

E20 Fuel: గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఏటేటా పెరుగుతుండడంతో ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తున్నాయి. ప్రకృతికి ఎలాంటి హాని జరగకుండా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్న భారత్ కూడా ఈ విషయంలో తన వంతు కృషి చేస్తోంది. ఉద్గారాలను తగ్గించడానికి జీవ ఇంధన వినియోగం పెంచేలా E20 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరి E20 అంటే ఏంటి? ఈ జీవ ఇంధనం వల్ల వాహనాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? వంటి పూర్తి వివరాలను న్యూస్ 18 ఎక్స్ ప్లెయిన్‌లో తెలుసుకుందాం..

రైతులకు బ్యాంక్ అదిరే శుభవార్త.. ఉచితంగా క్రెడిట్ కార్డు, లాభాలెన్నో!

* E20 అంటే ఏంటి?

E20 అంటే.. 20 శాతం ఇథనాల్‌ను కలిపి పెట్రోల్‌ను అందించడం. 20 శాతం ఇథనాల్‌తో బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. E20 బ్లెండెడ్ పెట్రోల్ 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపిక చేసిన 84 పెట్రోల్ బంక్‌ల్లో అందుబాటులోకి వచ్చింది. E20 కార్యక్రమం మొదటి దశల్లో 15 నగరాలు అమలు చేయనున్నారు. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.

కారు కొనాలనుకునే వారికి ఎస్‌బీఐ బంపర్ బొనాంజా.. ఒకేసారి 3 శుభవార్తలు

* ఇథనాల్ ఉత్పత్తి?

ఇథనాల్  (C2H5OH )అనే జీవ ఇంధనం.. చక్కెరను పులియబెట్టినప్పుడు సహజంగా ఉత్పత్తి అవుతుంది. చక్కెర చెరకు నుంచి వస్తుంది. తృణధాన్యాలు వంటి ఇతర సేంద్రీయ పదార్థాలను కూడా ఇథనాల్ తయారు చేయవచ్చు.

* ఉద్గారాల తగ్గుదల శాతం

E20 వినియోగం వల్ల ద్విచక్ర వాహనాల్లో 50 శాతం, ఫోర్ వీలర్స్‌లో దాదాపు 30 శాతం కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. ఇక, హైడ్రోకార్బన్ ఉద్గారాలు ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లలో 20 శాతం తగ్గుతాయి. భారతదేశం ప్రస్తుతం చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవడానికి E20 బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం కీలకం కానుంది.

* పరిశోధన వివరాలు

భారత్‌లో E20 బ్లెండెడ్ పెట్రోల్ వినియోగంపై ఇప్పటికే ఓ పరిశోధన జరిగింది. ప్రస్తుతం ఉన్న వాహనాల్లో E20 బ్లెండెడ్ పెట్రోల్ వినియోగం కారణంగా ఇంజన్‌లోని మెటల్స్, మెటల్స్ కోటింగ్స్‌లో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా తన రిపోర్ట్ లో పేర్కొంది. స్వచ్ఛమైన గ్యాసోలిన్‌తో పోలిస్తే ఎలాస్టోమర్స్‌లో E20 తక్కువ పనితీరు కనబర్చిందని, E20తో టెస్ట్ చేసిన తర్వాత, PA66 ప్లాస్టిక్ టెన్సిల్ స్ట్రెంత్ తగ్గిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త!

* ఫ్యూయల్ ఎకానమీ 6% వరకు తగ్గుదల

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (R&D) 2014-2015లో నిర్వహించిన పరిశోధన ప్రకారం.. ఫ్యూయల్ ఎకానమీ వ్యవస్థ వాహన రకాన్ని బట్టి సగటున 6% వరకు తగ్గింది. అయితే, స్వచ్ఛమైన గ్యాసోలిన్, E20 ఇంధనాన్ని వేర్వేరుగా వాహనాల్లో వేడి, చల్లటి ప్రారంభ సామర్థ్యం వద్ద, డ్రైవబిలిటీ వద్ద టెస్టింగ్‌ చేయడం ద్వారా పెద్ద లోపాలు, స్టాల్ ఉత్పన్నం కాలేదని పరిశోధనలో తేలింది. అంతేకాకుండా ఆన్-రోడ్ మైలేజ్ అక్యుములేషన్ ప్రయోగాల తర్వాత, అసాధారణ ఇంజన్ కాంపోనెంట్ వేర్, డిపాజిట్స్, ఆయిల్ క్షీణత వంటి సమస్యలు ఏర్పడలేదని పరిశోధనలో వెల్లడైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *