Headache Home Remedies: తలనొప్పికి ట్యాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా..? ఈ చిట్కాలు ఫాలో అయితే వెంటనే తగ్గుతుంది..!

Headache Home Remedies:  మనకు తలనొప్పి రాగానే.. వెంటనే‌ మెడిసిన్‌ బాక్స్‌లో నుంచి ట్యాబ్లెట్‌ తీసుకుని వేసేసుకుంటాం. ఎసిడిటీ, స్టఫ్డ్ సైనస్, నిద్ర లేమి, ఒత్తిడి, అజీర్ణం, గ్యాస్ట్రిక్‌, మలబద్ధకం కారణంగానూ తలనొప్పి వచ్చే అవకాశం ఉందని డాక్టర్‌ అపర్ణ అన్నారు. మందులతో తాత్కాలిక ఉపశమనం పొందే బదులు, తలనొప్పికి కారణం తెలుసుకుని పర్మనెంట్‌ ట్రీట్మంట్‌ తీసుకోవాలని డాక్టర్‌ అపర్ణ అన్నారు.

Headache Home Remedies: తలనొప్పి.. ఇది అందర్నీ వేధించే సమస్య. మనకు తలనొప్పి రాగానే.. వెంటనే‌ మెడిసిన్‌ బాక్స్‌లో నుంచి ట్యాబ్లెట్‌ తీసుకుని వేసేసుకుంటాం. అసలు తలనొప్పి ఎందుకొస్తుంది, తలనొప్పికి కారణంగా ఏమిటి అని అలోచించం. ఎప్పుడు తలనొప్పి వచ్చినా మనకు మందులే ఫస్ట్‌ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. తలనొప్పికి మాత్రలు వేసుకోవడం.. శాశ్వత నివారణ కాదని ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్‌ అపర్ణ అన్నారు. శిరోభారంగా ఉంటే.. మందులతో తాత్కాలిక ఉపశమనం పొందే బదులు, తలనొప్పికి కారణం తెలుసుకుని పర్మనెంట్‌ ట్రీట్మంట్‌ తీసుకోవాలని డాక్టర్‌ అపర్ణ అన్నారు. మనకు ఒత్తిడి ఎక్కువైనా, అలసట కారణంగా, దూర ప్రయణాలు చేస్తున్నా తలనొప్పి వస్తుంది. చెడు ఆహార అలవాట్లు, బిజీ లైఫ్‌స్టైల్‌, మానసిక ఆందోళన నొప్పి రావడానికి కొన్ని కారణాలు. మైగ్రేన్ తల నొప్పి, టెన్షన్ తల నొప్పి, సైనస్ తల నొప్పి, క్లస్టర్ తల నొప్పి, అలెర్జీ తల నొప్పి.. ఇలా మొత్తం 200 రకాలకు పైగా తల నొప్పులు ఉన్నాయి. ఎసిడిటీ, స్టఫ్డ్ సైనస్, నిద్ర లేమి, ఒత్తిడి, అజీర్ణం, గ్యాస్ట్రిక్‌, మలబద్ధకం కారణంగానూ తలనొప్పి వచ్చే అవకాశం ఉందని డాక్టర్‌ అపర్ణ అన్నారు.

ఎసిడిటీ, గ్యాస్‌ వల్ల తలనొప్పి వస్తే..

ఎసిడిటీ, గ్యాస్‌ కారణంగా తలనొప్పి ఉంటే.. 5 గ్రాముల సోంపు గింజలు, 10 గ్రాముల జీలకర్ర, 5 గ్రాముల ధనియాలు.. నీటిలో వేసి మరిగించి రోజుకు రెండు సార్లు తీసుకోవాలని డాక్టర్‌ అపర్ణ సూచించారు. (Image source – Pixabay)

ఒత్తిడి, నిద్రలేమి వల్ల అయితే..

నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వల్ల చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారని డాక్టర్‌ అపర్ణ అన్నారు. మీకూ ఈ సమస్య ఉంటే.. నూవ్వుల నూనెను డబుల్‌ బాలిలర్‌ మెథడ్‌లో వేడి చేయండి. గోరువెచ్చని నూనెతో తలకు, శరీరానికి మర్దన చేసి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.

లావెండర్‌ నూనె దిగులు, ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. మీరు ఎసెన్షియల్ ఆయిల్‌ను నేరుగా మీ చర్మానికి అప్లై చేయకూడదు. ఎసెన్షియల్ ఆయిల్‌ను ప్రతిరోజూ ఉపయోగించే ఏదైనా నూనెతో కలిపి.. చర్మంపై అప్లై చెయ్యాలి. ఈ నూనెను మసాజ్‌ చేయడానికి వాడొచ్చు. టిష్యూ, కర్చీఫ్‌పై కొన్ని చుక్కల ఎసెన్షియల్‌ నూనె వేసుకుని వాసన కూడా చూడొచ్చు.

సైనస్‌ కారణంగా తలనొప్పి వస్తే..

బ్యాక్టిరియల్‌, వైరల్‌ ఇన్ఫెక్షన్ల వల్ల.. శ్వసకోస వాపు కారణంగా సైనసైటిస్‌ వస్తుంది. దీని కారణంగా రెండు ముక్కులు బిగుసుకొని పోతాయి, తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరంగా ఉంటుంది. కనుబొమ్మలు జివ్వుమని లాగుతుంటాయి, విపరీతమైన తలనొప్పి ఉంటుంది. సైనస్‌ తలనొప్పి ఉన్నవారు రోజూ ఆవిరి పట్టాలని డాక్టర్‌ అపర్ణ సూచించారు. నాస్య/నేతి క్రియ చేయడం ద్వారా కూడా ఈ సమస్య దూరం అవుతుందని అన్నారు.

సైనస్‌తో బాధపడేవారికి నీలగిరి తైలం ఔషదంలా పనిచేస్తుంది. ఈ నూనెతో నుదుటిపై, కణతలుకు సున్నితంగా మర్దన చేసుకుంటే.. తలనొప్పి వెంటనే తగ్గుతుంది. నీలగిరి తైలంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. (Image source – Pixabay)

మైగ్రేన్‌ తలనొప్పి..

మైగ్రేన్‌ బాధ వర్ణనాతీతం. తలపైన సుత్తితో కొట్టినట్లు.. విపరీతమైన నొప్పి బాధపెడుతుంది. తలలో నరాలు చిట్లిపోతున్నంతగా నొప్పి వేధిస్తుంటుంది. నరాల సంకేతాలు, న్యూరోట్రాన్స్మిటర్లు, మెదడులోని రక్త నాళాలు. హార్మోన్ల, భావోద్వేగాలు, శారీరక, పోషక, పర్యావరణ, ఔషధ కారకాలు మైగ్రేన్‌కు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. లావెండర్‌ నూనె మైగ్రేన్ తలనొప్పితో పోరాడటానికి ఉపయోగించవచ్చు. లావెండర్‌ నూనెను నేరుగా మీ చర్మానికి అప్లై చేయకూడదు. ఎసెన్షియల్ ఆయిల్‌ను ప్రతిరోజూ ఉపయోగించే ఏదైనా నూనెతో కలిపి.. చర్మంపై అప్లై చెయ్యాలి. ఈ నూనెను మసాజ్‌ చేయడానికి వాడొచ్చు.

దీర్ఘకాలికంగా తలనొప్పి వేధిస్తుంటే..

దీర్ఘకాలిక తలనొప్పి వేధిస్తుంటే.. ఆయుర్వేదంలోని కొన్ని నివారణలు పాటిస్తే.. 3-4 నెలల్లో తగ్గిపోతుందని డాక్టర్‌ అపర్ణ అన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

యోగా చేయండి

సమయానికి నిద్రపోండి

రోజూ 2-3 లీటర్ల నీరు త్రాగాలి

పులియబెట్టిన, మసాలా అధికంగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి

టీ/కాఫీలకు దూరంగా ఉండండి

(Image source – Pixabay)

ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..

ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

గోరువెచ్చని పాలు తాగితే.. తలనొప్పి తగ్గుతుంది.

మీ ఇంట్లో గంధం పౌడర్ ఉంటే. పేస్టులా చేసుకుని తలకు రాసుకోండి.

అల్లాన్ని నమిలినా తలనొప్పి తగ్గుతుంది.

తలనొప్పి ఎక్కువగా ఉంటే.. వెలుగు తక్కువగా ఉండే ప్రాంతంలో లెస్ట్‌ తీసుకోండి. (Image source – Pixabay)

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *