Kapildev: పంత్ కనిపిస్తే చెంప చెళ్లు మనిపిస్తా: కపిల్ దేవ్ ఇటీవల కారు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇంకా ముంబైలోని ఓ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ పంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ ను కొట్టాలనుందని అన్నాడు.
గాయాలతో పంత్ దూరం కావడంతో టీమిండియాకు సవాల్ గా మారింది. టీమిండియా బోర్డర్ గవాస్కర్ సిరీస్ తో పాటు వన్డే ప్రపంచ కప్ ఆడనుంది. పంత్ లేకపోవడంతో టీమిండియా కాంబినేషన్ పెద్ద సవాల్ గామారింది. ఈ నేపథ్యంలో పంత్ పూర్తిగా కోలుకుని వచ్చాకి ఇలాంటి తప్పిదాలు చేయొద్దని అతని చెంపదెబ్బ కొడతానని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. రిషభ్ పంత్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. పంత్ లేకపోవడంతో టీమిండియాలో గందరగోళం నెలకొందని తెలిపాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలని పంత్ ను మందలిస్తా అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు.
©️ VIL Media Pvt Ltd.