కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) ఇటీవల 13వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిని విషయం తెలిసిందే. ఈ పరీక్షలు అనేవి 06 మార్చి 2023 వరకు కొనసాగుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(Drive) ద్వారా.. KVSలో అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, PGT, TGT, లైబ్రేరియన్, PRT (మ్యూజిక్), ఫైనాన్స్ ఆఫీసర్(Finance Officer), అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొదలైన 13000 కంటే ఎక్కువ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనిలో ఫిబ్రవరి 07 న అసిస్టెంట్ కమిషనర్, ఫిబ్రవరి 08న ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 09న వైస్ ప్రిన్సిపాల్ మరియు PRT (సంగీతం) పోస్టులకు పరీక్ష ఉంటుంది. ఈ పోస్టులకు ఇప్పటికే అడ్మిట్ కార్డులు విడుదల చేశారు.
తాజాగా.. ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 14 టీజీటీ పరీక్షలు జరుగుతుండగా.. వాటికి సంబంధించి పరీక్ష సెంటర్ వివరాలను తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్షకు మూడు రోజుల ముందు అధికారిక సైట్ నుండి పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలరు. KV TGT పరీక్ష ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 14 వరకు నిర్వహించబడుతుంది.
అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్లేటప్పుడు అడ్మిట్ కార్డ్‌తో పాటు ఎగ్జామ్ సిటీ స్లిప్ తీసుకెళ్లడం మంచిది. అంతే కాకుండా అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అదే సమయంలో.. కేంద్రం వద్ద ఎలాంటి గాడ్జెట్‌ను తీసుకెళ్లడానికి అనుమతించబడదు.
ఇది కూడా చదవండి : After 12th Class: 12వ తరగతి పూర్తి చేశారా.. మీ లైఫ్ ని మార్చే 5కోర్సులు ఇవే..
సెంటర్ వివరాలను ఈ స్టెప్స్ ద్వారా తెలుసుకోండి..
Step 1: ముందుగా అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.inని సందర్శించండి
Step 2: ఆ తర్వాత TGT ఎగ్జామ్ సిటీ లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: ఇప్పుడు అభ్యర్థి అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేసి సమర్పించండి.
Step 4: అప్పుడు KVS TGT పరీక్షా సిటీ వివరాలు కనిపిస్తుంది.
Step 5: ఆ తర్వాత అభ్యర్థి దానికి సంబంధించి వివరాలను డౌన్‌లోడ్ చేయండి.
Step 6: చివరగా అభ్యర్థులు డౌన్ లోడ్ చేసిన పీడీఎఫ్ ను ప్రింట్ అవుట్ తీసుకోండి.