లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వేర్వేరు వర్గాలకు పలు రకాల ఇన్స్యూరెన్స్ పాలసీలను రూపొందిస్తూ ఉంటుంది. పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్స్… ఇలా ప్రత్యేక పాలసీలను అందిస్తోంది. ఎల్ఐసీ అందించే పాలసీల్లో కొన్ని పాపులర్ అవుతుంటాయి. ఆ ప్లాన్స్‌లో ఎక్కువగా రిటర్న్స్ వస్తుంటాయి కాబట్టి ఎక్కువమంది ఆ ఎల్ఐసీ పాలసీలను (LIC Policy) తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి పాపులర్ పాలసీల్లో ఒకటి జీవన్ ఉమాంగ్ పాలసీ. ఇది సమగ్ర జీవిత కవరేజీని, మంచి రిటర్న్స్‌ని అందించే ప్లాన్. దీర్ఘకాలం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునేవారు ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు.
ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీలో మెచ్యూరిటీ తర్వాత కూడా బెనిఫిట్స్ లభిస్తాయి. దీన్నే సర్వైవల్ బెనిఫిట్స్ అంటారు. పాలసీహోల్డర్ మెచ్యూరిటీ వరకు ప్రీమియం డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత సర్వైవల్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. మెచ్యూరిటీ సమయంలో మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తాయి. పాలసీ ముగిసిన తర్వాత కూడా ప్రయోజనం పొందాలనుకునేవారు ఈ పాలసీ తీసుకోవచ్చు.
Shirdi Tour: రెండు రోజుల షిరిడీ టూర్ ప్యాకేజీ… రూ.2400 మాత్రమే
టూర్ ప్యాకేజీ… రూ.2400 మాత్రమే
ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ అర్హతలు
ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీని కనీసం రూ.2,00,000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో తీసుకోవచ్చు. గరిష్టంగా ఎంత సమ్ అష్యూర్డ్ అయినా ఎంచుకోవచ్చు. ప్రీమియం చెల్లించే టర్మ్ 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్లుగా ఉంటుంది. 100 నుంచి వయస్సు తీసేస్తే ఎన్నేళ్లు వస్తుందో అన్నేళ్లు పాలసీ టర్మ్ ఉంటుంది. ఉదాహరణకు 35 ఏళ్ల వయస్సులో పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 65 ఏళ్లుగా ఉంటుంది.
ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 90 రోజులు ఉండాలి. గరిష్ట వయస్సు 55 ఏళ్లు. మెచ్యూరిటీ వయస్సు 100 ఏళ్లు. పాలసీ తీసుకునేవారి వయస్సు 8 ఏళ్ల లోపు ఉంటే రెండేళ్ల తర్వాత రిస్క్ కవర్ మొదలవుతుంది. ఒకవేళ వయస్సు 8 ఏళ్ల పైన ఉంటే రిస్క్ కవర్ వెంటనే ప్రారంభం అవుతుంది.
Tax Saving Tips: పన్ను ఆదా చేయడానికి 70 రకాల మినహాయింపులు, తగ్గింపులు
ఈ పాలసీ రిటర్న్స్ విషయానికి వస్తే పాలసీహోల్డర్ చివరి ప్రీమియం చెల్లించిన తర్వాత సర్వైవల్ బెనిఫిట్స్ వస్తాయి. బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 8 శాతం చొప్పున లెక్కించి ప్రతీ ఏటా సర్వైవల్ బెనిఫిట్ ఇస్తారు. ఇలా 99 ఏళ్ల వయస్సు వచ్చేవరకు తీసుకోవచ్చు. 100 ఏళ్లు పూర్తైన తర్వాత మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి.
ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 30 ఏళ్లు ప్రీమియం చెల్లించేలా రూ.5,00,000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకున్నారనుకుందాం. ఏటా రూ.14,758 ప్రీమియం చెల్లించాలి. 30 ఏళ్లు పూర్తిగా ప్రీమియం చెల్లించిన తర్వాత సర్వైవల్ బెనిఫిట్ కింద ప్రతీ ఏటా రూ.40,000 లభిస్తాయి. మెచ్యూరిటీ సమయంలో రూ.5,00,000 + సుమారు రూ.10 లక్షల పైనే బోనస్ లభిస్తుంది.