Navpancham Yog 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయిక జరిగిన సమయంలో ద్వాదశరాశులలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు.. మరికొన్ని రాశుల అశుభ ఫలితాలొస్తాయి.
Navpancham Yog 2023 వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు వాటి స్థానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇవి వాటి స్థానాలను మారినప్పుడు ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు కలయిక జరిపినప్పుడు కొన్ని రాజ యోగాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో స్నేహపూరిత గ్రహాలైన సూర్యుడు, అంగారకుడు తొమ్మిది, ఐదో స్థానంలో సంచారం చేయనున్నారు. ఇప్పుడు సూర్యుడు మకరరాశిలో నివాసం ఉండగా.. అంగారకుడు వృషభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇలా ఒకదానికొకటి తొమ్మిది, ఐదో స్థానంలో సంచారం చేయడాన్ని పవిత్ర సమయంగా పరిగణిస్తారు. ఇలా సూర్యుడు, అంగారకుడు త్రికోణ స్థానాల్లో ఉండే సమయంలో నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ద్వాదశ రాశుల వారిలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నవ పంచమ యోగం వల్ల ఈ రాశులకు ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఈ సందర్భంగా ఈ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి.
సూర్యుడు, కుజుడు ఈ స్థానాల్లో ఉంటే..
వేద జ్యోతిష్యశాస్త్రంలో నవ గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహం నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి రవాణా చేస్తూ ఉంటుంది. ఇలా గ్రహాలు రవాణా చేసిన సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, నెఫ్ట్యూన్ తమ స్థానాలను మారనున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సూర్యుడు, అంగారకుడు 9, 5వ స్థానాల్లో సంచారం చేయడాన్ని పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. దీంతో మరో ఐదు రోజుల్లో నవపంచమ యోగం ఏర్పడనుంది.
Mahashivratri 2023 మహా శివరాత్రి వేళ ఏయే రాశుల వారికి ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందంటే…!
మేష రాశి(Aries)..
ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. కుజుడితో కలిసి సూర్యుడు నవ పంచమ యోగం ఏర్పరచడం వల్ల మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి కుజుడు రెండో స్థానంలో.. సూర్యుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో మేషరాశి వారికి అకస్మాత్తుగా ఆదాయం పెరుగుతుంది. సమాజంలోనూ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో పని చేసే ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. మీరు కోరుకున్న ప్రాంతానికి బదిలీ కూడా అయ్యే అవకాశం ఉంది.
వృషభ రాశి (Taurus)..
ఈ రాశి వారికి నవపంచమ యోగం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. ఇదే రాశిలో అంగారకుడి సంచారం చేయడం.. సూర్యుడు ఈ రాశి నుంచి తిమ్మిదో స్థానంలో సంచారం చేయడం కారణంగా, ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరేందుకు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించి ఈ వారం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి(Cancer)..
ఈ రాశి వారికి నవపంచమ యోగం వల్ల ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి నుంచి అంగారకుడు పవిత్ర స్థానంలో సంచారం చేయడం కారణంగా త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. దీంతో మీ వైవాహిక జీవితంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారులకు భారీగా లాభాలొస్తాయి. మీకు రావాల్సిన బకాయిలు తిరిగొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలు నెరవేరే అవకాశం ఉంది.
గమనిక
: ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
Read
Latest Astrology News
and