Nissan Magnite Price: చౌకైన, సూపర్ లుకింగ్ ఎస్‌యూవీ.. ఫీచర్లు కూడా అదుర్స్! టాటా పంచ్ కంటే తక్కువ ధర

Buy Best SUV Nissan Magnite in Tata Punch Price: ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో ఎస్‌యూవీలలో ‘టాటా పంచ్’ ముందు వరసలో ఉంది. ధర, లుకింగ్ కారణంగా జనాలు ఈ కారుని కొనాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే టాటా పంచ్‌ను కొనుగోలు చేసే ధరలోనే.. పెద్ద ఎస్‌యూవీ మీ ఇంటికి వస్తుంది. నిజమే.. మార్కెట్లో చౌకైన, సూపర్ లుకింగ్ ఎస్‌యూవీ ఒకటి ఉంది. అదే ‘నిస్సాన్ మాగ్నైట్’. ఇది టాటా పంచ్ కంటే పెద్దది అయినా.. అదే ధరలో అందుబాటులో ఉంది. 

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ధర రూ. 5.97 లక్షల నుంచి రూ. 10.79 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. టాటా పంచ్ ధర కూడా రూ.6 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ రెండూ 5 సీట్ల ఎంపికలో వస్తాయి. మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అమ్మబడుతోంది. రెండు ఎంపికలలో ఒకటి1.0L పెట్రోల్ ఇంజన్ (72PS పవర్ మరియు 96Nm టార్క్) కాగా.. మరొకటి 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ (100PS పవర్ మరియు 160Nm టార్క్/100PS మరియు 152Nm టార్క్).

నిస్సాన్ మాగ్నైట్ కారు రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ప్రామాణికంగా కలిగి ఉంటాయి. అయితే టర్బో ఇంజిన్‌తో CVT గేర్‌ బాక్స్ కూడా ఉంటుంది. మాగ్నైట్ పెట్రోల్ మాన్యువల్ లీటరుకు 20 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. పెట్రోల్ ఆటోమేటిక్ 17.7 కిమీ మైలేజీని ఇస్తుంది.

నిస్సాన్ మాగ్నైట్ కారు 360-డిగ్రీ కెమెరా, 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటు)ను కలిగి ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం.. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఉన్నాయి. EBDతో కూడిన ABS మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.

Also Read: Valentines Day 2023 Offers: వాలెండైన్స్‌ డే 2023 ఆఫర్స్‌.. ఐఫోన్‌ 14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు!

Also Read: Toyota Fortuner Price: రూ. 26 లక్షలకే టయోటా ఫార్చ్యూనర్.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *