ఇన్నాళ్లూ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేసిన వన్‌ప్లస్, తొలిసారి ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేసింది. ఇండియాలో వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) స్మార్ట్‌ఫోన్లతో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2, వన్‌ప్లస్ ప్యాడ్ (OnePlus Pad) లాంఛ్ చేసింది కంపెనీ. ఇందులో 144Hz డిస్‌ప్లే, 67వాట్ ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ ప్యాడ్ ధర ఎంతో ఇంకా ప్రకటించలేదు. ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో రిలీజ్ అవుతుందని అంచనా. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ (Realme Pad X), షావోమీ ప్యాడ్ 5 లాంటి ట్యాబ్లెట్స్‌కు పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ విశేషాలివే
వన్‌ప్లస్ ప్యాడ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 11.6 అంగుళాల 2.8K డిస్‌ప్లే ఉంది. డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 13 + ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
WhatsApp: వాట్సప్‌లో 5 కొత్త ఫీచర్స్ వచ్చేశాయి… ఇలా వాడుకోవాలి
వన్‌ప్లస్ ప్యాడ్‌లో 9,510mAh భారీ బ్యాటరీ ఉండగా 67W వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఒక నెల స్టాండ్ బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. స్టైలస్, మ్యాగ్నెటిక్ కీబోర్డ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. వీటిని వేరుగా కొనాల్సి ఉంటుంది.
వన్‌ప్లస్ ప్యాడ్‌లో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఓమ్నీబేరింగ్ సౌండ్ ఫీల్డ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ బరువు 552 గ్రాములు. కేవలం హాలో గ్రీన్ కలర్‌లో మాత్రమే వన్‌ప్లస్ ప్యాడ్ రిలీజైంది. వన్‌ప్లస్ ప్యాడ్ ధరను త్వరలో ప్రకటించనుంది కంపెనీ. ఏప్రిల్‌లో ప్రీ-ఆర్డర్ ప్రారంభం అవుతుంది. భారతదేశంతో పాటు నార్త్ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ ట్యాబ్లెట్ అందుబాటులో ఉంటుంది.
Oppo Reno 8T 5G: కర్వ్‌డ్ డిస్‌ప్లే, పాపులర్ ప్రాసెసర్, 108MP కెమెరాతో ఒప్పో రెనో 8టీ రిలీజ్
వన్‌ప్లస్ 11 సిరీస్
వన్‌ప్లస్ 11 సిరీస్‌లో వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ 11ఆర్ 5జీ రిలీజ్ అయ్యాయి. వన్‌ప్లస్ 11 5జీ ప్రారంభ ధర రూ.56,999. ఇందులో 6.7 అంగుళాల QHD+ ఫ్లెక్సిబుల్ అమొలెడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 2 ప్రాసెసర్, 50మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఇక వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ప్రారంభ ధర రూ.39,999. ఇందులో 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 50మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.