Pakistan Accident: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం…30 మంది దుర్మరణం

Road accident in Pakistan: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణీకుల బస్సు- కారు ఎదురెదురుగా ఢీకొని రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కోహిస్థాన్ జిల్లాలోని కారకోరం హైవేపై మంగళవారం చోటుచేసుకుంది. ప్రావిన్స్‌లోని షిటియాల్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కారును గిల్గిట్ నుండి రావల్పిండికి వెళ్తున్న ప్యాసింజర్ బస్సు ఢీకొట్టింది. 

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని.. క్షతగాత్రులను, మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. చీకటి కారణంగా సహాయక చర్యల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రెస్క్యూ అధికారులు తెలిపారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి పాకిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, గిల్గిత్ బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

పాకిస్థాన్ లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. జనవరి 29న పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ప్రయాణీకుల బస్సు లోయలో పడి 41 మంది దుర్మరణం చెందారు. క్వెట్టా నుంచి కరాచీకి 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు లాస్బెలా సమీపంలోని వంతెన పిల్లర్‌ను ఢీకొట్టి లోయలో పడి మంటలు అంటుకున్నట్లు లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్ హంజా అంజుమ్ తెలిపారు. 

Also Read: Pervez Musharraf: బిగ్ బ్రేకింగ్.. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ కన్నుమూత 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *