SIR Trailer : ధనుష్‌ సార్ ట్రైలర్ విడుదల.. ఆ డైలాగ్స్ మాత్రం కేక

Dhanush SIR Trailer ధనుష్ సంయుక్త మీనన్ కాంబోలో సార్ సినిమా రాబోతోంది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. జీవీ ప్రకాష్‌ కొట్టిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పుడు అందరిలోనూ అంచనాలు పెంచేశాయి.

 

చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వారికి చదువు దొరకలేదు.. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ల కోసం ఉంటారన్న నమ్మకం వాళ్లకి కుదరడం లేదు.. అడిగింది కొనివ్వకపోతే పిల్లలు ఆ ఒక్క రోజే ఏడుస్తారు.. కానీ పిల్లల తల్లిదండ్రులు మాత్రం కొనివ్వలేని పరిస్థితి ఉన్నంతకాలం ఏడుస్తూనే ఉంటారు.. వాళ్లు గెలిచాం అనుకున్నారు.. కానీ.. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు గానీ.. మర్యాద అనేది చదువు వల్లే వస్తుంది.. అనే డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి.

ఇక విద్యారంగంంలో వచ్చే అంత డబ్బు పాలిటిక్స్‌లోనూ రాదు అని సముద్రఖని చేత చెప్పించిన డైలాగ్‌తోనే ఈ సినిమా నేపథ్యం ఏంటో అర్థం అవుతోంది. డబ్బు, చదువు ఇంపార్టెన్స్ చెప్పే కోణంలోనే ఈ సార్ ఉండబోతోంది. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ మీద విమర్శనాస్త్రంలానే ఈ సార్ సినిమా ఉంటుంది.

ఇందులో సార్‌గా ధనుష్‌ ఎంతో సహజంగా కనిపించాడు. సంయుక్త మీనన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తోంది. ఇక జీవీ ప్రకాష్‌ కొట్టిన ఆర్ఆర్, ఇచ్చిన పాటలు సినిమాకు హైలెట్ అయ్యేలానే ఉన్నాయి. సార్ సినిమాలో ధనుష్ పాత్ర పక్కనే హైపర్ ఆది కనిపించాడు. చూస్తుంటే ఈ సినిమాతో ఆది తమిళ నాట కూడా ఫేమస్ అయ్యేలానే ఉన్నాడు.

Also Read:  Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు

Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *