Turkey earthquake : టర్కీలో చిన్నారుల దీనగాధ టర్కీలో వరుస భూకంపాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. భూకంపాల కారణంగా టర్కీలో వేల మంది ప్రాణాలు విడిచారు. శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది నరకం చూశారు. ఎంతో మంది తమ కుటుంబాలకు దూరమయ్యారు. ఇక చిన్నారుల పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతోంది. బోసినవ్వుల చిన్నారులు నిర్జీవంగా మారిన దృశ్యాలు కంట నీరు పెట్టిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఓ చిన్నారిని రెస్యూ సిబ్బంది భుజాలపై మోసుకెళ్తున్న ఫొటో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు భూకంపంలో చనిపోయిన పసికందు మృతదేహాన్ని పట్టుకుని ఓ వ్యక్తి గుండెలు పగిలేలా విలపిస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తున్నాయి. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల దుఖాన్ని ఆపడం ఎవరితరం కావడం లేదు.
భూకంపాల కారణంగా శవాల దిబ్బగా మారిన టర్కీలో ఇప్పుడు ఎటు చూసినా విగత జీవులే కనిపిస్తున్నారు. ఆస్పత్రుల్లో వేల మంది చికిత్స పొందుతున్నారు. తమవారు బతికున్నారో, లేదో తెలియక బాధితులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. చంటి బిడ్డలను ఎత్తుకొని ప్రాణ భయంతో వీధుల వెంట పరుగుతుండగా.. పక్కనే ఉన్న భవనాలు కుప్పకూలుతున్న దృశ్యాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
©️ VIL Media Pvt Ltd.