Turkey-Syria Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో 24 గంటల్లో 312 సార్లు కంపించిన భూమి, ఇవాళ కూడా భూకంపం హెచ్చరిక

చరిత్రలో కనీవినీ ఎరుగని ఘోర విపత్తు. ఒకేరోజు వరుసగా మూడు సార్లు తీవ్రంగా భూమి కంపించడమే కాకుండా..మధ్య మధ్య చిన్న చిన్నగా కంపిస్తుండటం ఇలా 24 గంటలు దాటి కొనసాగడం బహుశా ఎక్కడా జరిగుండదు. అందుకే సిరియా, టర్కీ దేశాల్లో ఇంతటి ఘోర విపత్తు చోటుచేసుకుంది.

జనవరి 6వ తేదీ తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉండగా 4 గంటల ప్రాంతంలో 7.9 తీవ్రతతో భారీ భూకంపం. టర్కీ, సిరియా దేశాల్ని అతలాకుతలం చేసేసింది. పెద్దఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ దేశాల్లో భూకంపం వార్తలు పూర్తిగా ప్రపంచానికి తెలిసేలోగా..సహాయక చర్యలు కొనసాగుతుండగా…మద్యాహ్నం సమయంలో మరోసారి 7.5 తీవ్రతతో భూమి కదిలిపోయింది. అంతే మరోసారి విలయం ఏర్పడింది. వందలాది భవనాలు నేలకొరిగాయి. శిధిలాలు ఇంకా పెరిగాయి. మరణాల సంఖ్య పెరిగింది. ఊహించని పరిణామంతో తేరుకునేలోగా సాయంత్రం మూడవసారి 6.0 తీవ్రతతో భూమి కంపించింది. ఇలా మూడుసార్లు భారీగా భూమి కంపించడంతో టర్కీ, సిరియా దేశాల్లో తీవ్రత పెరిగింది. ప్రమాదనష్టం అధికమైంది. 

ఈ మూడు భారీ ప్రకంపనలతో పాటు రోజంతా, మరుసటి రోజు అంటే జనవరి 7వ తేదీన కూడా భూమి కంపిస్తూనే ఉంది. నిన్న అంటే జనవరి 7వ తేదీన నాలుగవసారి భూమి 5.5 తీవ్రతతో కంపించి మళ్లీ భయపెట్టింది. పలు దేశాల జియోలాజికల్ సర్వే అంచనాల ప్రకారం జనవరి 6,7 తేదీల్లో ఈ రెండు దేశాల్లో భూమి 312 సార్లు కంపించినట్టు తేలింది. నిజంగా వింటుంటేనే భయంగా ఉంది కదా..ఇవాళ మరోసారి భూమి కంపించవచ్చనే హెచ్చరిక జారీ అయింది.

వరుసగా భూమి కంపిస్తుండటంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడుతోంది. శిధిలాల తొలగింపు ఆలస్యమయ్యే కొద్దీ శ్వాస ఆడక ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్నించి సహాయక చర్యలు అందుతున్నాయి. శిధిలాల్ని పూర్తి స్థాయిలొ తొలగిస్తే..మరణాల సంఖ్య 20వేలకు చేరుకోవచ్చనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.

Also read: Earthquake Death Toll: టర్కీ, సిరియాల్లో కొనసాగుతున్న మరణ మృదంగం, 8వేలకు చేరిన మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *