రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
సామాన్యంగా రోడ్లపై వెళ్లేటప్పుడు ద్విచక్ర వాహనాలకు, కారు, జీబు, లారీ ఇంకా ఏదైనా వాహనం కావచ్చు.. ఏదో ఒక రకంగా ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందులో వాహనాలు స్పీడ్ గా వెళ్లే సమయంలో ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ కావడంతో చాలావరకు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇలాంటి ప్రమాదానాలు నివారించేందుకే ఒక కొత్త రకమైన ఆలోచనతో కొత్త టెక్నాలజీతో వాహనాల టైర్ పంచర్ కాకుండా.. ఒకవేళ అయినా బ్లాస్ట్ అవ్వకుండా ఒక లిక్విడ్ ను తయారు చేశారు. వాహన చోదకులు ప్రయాణంలో టైరు పంచర్ అయి ఇబ్బంది పడకుండా ఉండటానికి అద్భుతమైన ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చేసింది. ఒకసారి వాహనం టైరులో ఈ లిక్విడ్ వేసినట్లయితే ఇక మీ ప్రయాణాన్ని సురక్షితంగా మీ గమ్యం చేరుకోవచ్చు.
ఏ వాహనాలైనా సరే పంచర్ కాకుండా ప్రయాణం చేసేటువంటి సదుపాయం కలిగిన ఈ లిక్విడ్ తెలంగాణ రాష్ట్రంలో బుర్ర శ్రీనివాస్ అనే టైరు డిస్ట్రిబ్యూటర్ తీసుకువచ్చాడట. ఈ లిక్విడ్ ని టైరు ట్యూబ్ లో కానీ ట్యూబ్ లెస్ టైర్లో నింపడం ద్వారా ఎంత దూరం ప్రయాణించినా టైర్లు అరిగిపోయే వరకు మార్చే అవసరం లేదట. అయితే ఈ లిక్విడ్ ని టైర్లలో ఎలా అమర్చాలంటే ముందుగా టైర్లలో గాలిని మొత్తం తీసేసి అందులో సిలెంట్ ఆయిల్ నింపిన తర్వాత గాలిని నింపుతారట, తర్వాత వాహనం వెళ్లే సమయంలో ఏదైనా మేకు దిగినా.. లేక ముళ్ళు దిగినా.. టైర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదని.. ఒకవేళ కొంతమేర గాలి తగ్గినా.. గాలి నింపితే సరిపోతుందని చెప్తున్నారు.
ఈ లిక్విడ్ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే టైరు అరిగేంతవరకు పంచర్ కాదని.. దీంతో పాటు టైరు వేడి కాకుండా కూల్ గా ఉంచుతుందని.. దీంతో టైరు జీవితకాలం సుమారు 40 శాతంగా పెరుగుతుందని చెప్తున్నారు. టైరు పగలకుండా కాపాడుతూ.. మేకులు దిగినా కూడా పంచర్ కాకుండా కాపాడుతుందని చెప్తున్నారు. కాగా అన్ని వాహనాలకు ఈ లిక్విడ్ వాడవచ్చునని చెప్పారు. మహిళా వాహనదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని.. ప్రయాణంలో టైరు పంచర్ అవుతుందనే భయం లేకుండా చెప్తున్నారు. వాహనం మైలేజ్ లో కూడా ఎలాంటి మార్పు ఉండదని, దీని ధర ఒక లీటర్ కి 700 రూపాయలు ఉంటుందని.. ఒక్క టైరులో ఒక లీటర్ పడుతుందని చెప్పారు.