Whatsapp new features: వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు యూజర్ల ప్రైవసీ, పాలసీకి భంగం కలగకుండా వాట్సా్ప్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ కొత్త ఫీచర్లని తీసుకొస్తుంది. అలానే ఇప్పుడు రెండు సరికొత్త ఫీచర్లని రోల్ అవుట్ చేసింది. వాట్సాప్ వచ్చాక చాలామంది విదేశాల్లో ఉన్నవాళ్లతో మాట్లాడటానికి వాట్సాప్ కాలింగ్ నే ఎక్కువ వాడుతున్నారు. అలా వాడేవాళ్లు తరచూ చాట్ లోకి వెళ్లి కాల్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని మార్చుతూ ఈ అప్ డేట్ తీసుకొస్తోంది. తరచూ వాట్సాప్ కాల్స్ చేసేవాళ్లు అవసరమైన కాంటాక్ట్స్ ను హోమ్ స్క్రీన్ పై సేవ్ చేసుకోవచ్చు. దాంతో నేరుగా హోమ్ స్క్రీన్ నుంచే వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు.
యూజర్లు గ్రూప్ లేదా వ్యక్తిగత చాట్ లోని మెసేజ్లను పిన్ చేసేలా మరొక ఫీచర్ రాబోతోంది. దీనిద్వారా కొన్ని ముఖ్యమైన చాట్లను యూజర్లు సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ మేరకు వాట్సాప్ బీటాఇన్ఫో ఒక నివేదిక తెలిపింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్.. త్వరలోనే అందుబాటులోకి రానుంది.
©️ VIL Media Pvt Ltd.