అదానీ కంపెనీలకు మరో పెద్ద దెబ్బ.. వాటి వాటా ఉపసంహరణ!

Adani Companies: నార్వేకు చెందిన 1.35 ట్రిలియన్ డాలర్ సావరిన్ వెల్త్ ఫండ్.. భారత్‌కు చెందిన అదానీ గ్రూప్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీల్లోని తమ వాటాలను మొత్తం గడచిన వారాల్లో ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేసింది. ESG ఇష్యూల గురించి అదానీని ఎన్నో సంవత్సరాలుగా మానిటర్ చేస్తున్నట్లు ESG రిస్క్ మానిటరింగ్ ఫండ్స్ హెడ్ క్రిస్టోఫర్ రైట్ చెప్పుకొచ్చారు. ఇక ఈ నార్వే వెల్త్ ఫండ్‌కు ఎన్నో ఏళ్ల నుంచి అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు ఉండగా.. వాటిని క్రమంగా ఉపసంహరించుకుంటూ వచ్చినట్లు వెల్లడించింది.

2014లో ఐదు అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగా.. 2022 చివరినాటికి వాటిని మూడు కంపెనీలకు తగ్గించున్నామని చెప్పిన నార్వే వెల్త్ ఫండ్.. వీటిలో ఇప్పుడు మొత్తం వాటాలను ఉపసంహరించుకున్నట్లు వివరించింది. అంటే 2023లోనే అదానీ కంపెనీల్లోని తమ పెట్టుబడులను మొత్తం వెనక్కి తీసుకున్నామని, ఇప్పుడిక అక్కడ తమకు ఏ వాటా లేదని స్పష్టం చేసింది.

97765742

2022 చివరి నాటికి నార్వే వెల్త్ ఫండ్‌కు అదానీ గ్రూప్ కంపెనీల్లోని అదానీ గ్రీన్ ఎనర్జీలో 52.7 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు, ఇక అదానీ టోటల్ గ్యాస్‌లో 83.6 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు, అదానీ పోర్ట్స్‌లో 63.4 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు నార్వే వెల్త్ ఫండ్‌కు ఉండేవి. కానీ ఇప్పుడు అవేం లేవని ఒక ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ కింద పనిచేసే ఈ నార్వే వెల్త్ ఫండ్‌కు.. ప్రపంచ దేశాల్లో లిస్టయిన షేర్లలో వాటాలు కొనుగోలు చేస్తుంది. మొత్తంగా దీనికి 1.3 శాతం వాటా ఉండటం గమనార్హం.

97754856

ఇక అదానీ గ్రూప్‌పై ఇటీవల అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అప్పటినుంచి అదానీ స్టాక్స్ పతనం అవుతున్నాయి. మార్కెట్ విలువ ఏకంగా 10 లక్షల వరకు పతనమైంది. అదానీ వ్యక్తిగత సంపద రూ. 5 లక్షల కోట్ల వరకు పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపేందుకు గౌతమ్ అదానీ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. ఇటీవల అమెరికాకు చెందిన డౌ జోన్స్ కూడా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను.. సస్టేనబుల్ ఇండిసెస్ జాబితా నుంచి తీసేసింది.

97737486

Read Latest

Business News and Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *