ఆసక్తిరేపుతున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్ నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. హీరో హీరోయిన్ పాత్రలను పరిచయం చేస్తూ, వాళ్ల చుట్టూ తిరిగే ప్రేమ సన్నివేశాలపై ఈ టీజర్ కట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో పదేళ్ల పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణం చూడవచ్చు. 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణంలోకి ప్రేక్షకులను తీసుకెళుతుంది. ఇందులో లవ్ సీన్స్ చాలా నేచురల్‌గా ఉంటాయి. టీజీ విశ్వ ప్రసాద్, దాసరి పద్మజ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
©️ VIL Media Pvt Ltd.