IND vs AUS 1st Test : నాగ్ పూర్ (Nagpur) వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత (India) స్పిన్నర్లు రవీంద్ర జడేజా (Ravindra Jadeja), రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)ల దెబ్బకు విలవిల్లాడారు. వీరి ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 63.5 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. జడేజా 5 వికెట్లతో చెలరేగాడు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. షమీ, సిరాజ్ లు చెరో వికెట్ సాధించారు. ఆసీస్ తరఫున మార్నస్ లబుషేన్ (123 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ (37), అలెక్స్ క్యారీ (36), హ్యాండ్స్ కాంబ్ (31) మినహా మిగిలిన ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు.
ఆస్ట్రేలియా భరతం పట్టిన జడేజా.. అశ్విన్.. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ఆలౌట్
