ఉచితంగానే క్రెడిట్ కార్డు అందిస్తున్న ఎస్‌బీఐ.. ఇలా పొందండి!

SBI News | మీరు కొత్తగా క్రెడిట్ కార్డు పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. దిగ్గజ క్రెడిట్ కార్డు (Credit Card) జారీ సంస్థ ఎస్‌బీఐ (SBI) ఉచిత క్రెడిట్ కార్డు ఆఫర్ అందుబాటులో ఉంచింది. మీరు ఎలాంటి చార్జీలు కట్టకుండానే ఉచితంగా ఈ క్రెడిట్ కార్డును పొందొచ్చు. ఈ ఆఫర్ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఎస్‌బీఐ ఉన్నతి క్రెడిట్ కార్డును అందిస్తోంది. ఈ కార్డును మీరు ఇప్పుడు ఉచితంగా పొందొచ్చు.

అయితే ఈ ఎస్‌బీఐ కార్డు ఉన్నతి ఆఫర్ కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉంటుంది. అంటే మీరు క్రెడిట్ కార్డు ఉచితంగానే తీసుకోవచ్చు. నాలుగేళ్ల వరకు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. తర్వాతి నుంచి మాత్రం చార్జీలు పడతాయి. మీకు ఈ క్రెడిట్ కార్డు కావాలని భావిస్తే.. దగ్గరిలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి ఆఫర్ వివరాలు తెలుసుకోవచ్చు. అక్కడే క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.

అదిరే ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.16,000 తగ్గింపు!

సాధారణంగా అయితే ఈ క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు రూ. 499. అయితే ఇప్పుడు బ్యాంక్ ఈ చార్జీలను మాఫీ చేసింది. ఉచితంగానే క్రెడిట్ కార్డును అందిస్తోంది. తొలి నాలుగు ఏళ్లు జాయినింగ్ ఫీజు, వార్షిక చార్జీలు లేకుండా ఉచితంగానే ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు. జీరో ఫీజు కార్డు అని చెప్పుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డుపై క్యాష్ అడ్వాన్స్, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, ఎన్‌క్యాష్, ఫ్లెక్సీ పే వంటి ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్లు మాత్రం రివార్డు ప్రోగ్రామ్ కిందకు రావు.

గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం, వెండి ధరలు, లేటెస్ట్ రేట్లు ఇలా!

ప్రతి రూ.100 ఖర్చుపై ఒక రివార్డు పాయింటు పొందొచ్చు. కార్డు పొందిన 15 రోజుల లోగా కార్డును ఉపయోగిస్తే.. రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎస్‌బీఐలో రూ. 25 వేలు లేదా అంతకన్నా ఎక్కువ ఎఫ్‌డీ మొత్తాన్ని కలిగిన వారికి మాత్రమే ఈ కార్డు లభిస్తుందని గుర్తించుకోవాలి. అంటే బ్యాంక్‌లో ఎఫ్‌డీ ఓపెన్ చేస్తే.. వారికి ఉచితంగా ఈ కార్డు వస్తుంది. క్రెడిట్ కార్డు పొందాలని భావించే వారికి ఇది సులువైన ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డుపై ఇంకా ఒక శాతం ఫ్యూయెల్ సర్‌చార్జ్ మినహాయింపు ఉంటుంది. క్రెడిట్ కార్డు పొందలేని వారు ఈ ఆప్షన్ కింద సులభంగా క్రెడిట్ కార్డు పొందొచ్చు. ఎస్‌బీఐ ఉన్నతి కార్డు పొందే వారు ఐదో సంవత్సరం నుంచి ఏడాదికి రూ. 499 చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *