ఎథికల్ హ్యాకింగ్ కెరీర్‌ ఎలా ఉంటుంది? కోర్సులు, జాబ్ రోల్స్, జీతాలు పూర్తి వివరాలివే!

పరీక్షల సమయం దాదాపు మొదలైపోయింది. మరికొన్ని రోజుల్లోనే 12వ తరగతి బోర్డ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సమయంలోనే విద్యార్థులు (Students) తమ కెరీర్ (Career) గురించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వేసే అడుగును బట్టి భవిష్యత్తు ఉంటుంది. న్యూస్18 అందిస్తున్న వీక్లీ కాలమ్ కెరీర్‌వైజ్‌లో భాగంగా ఎథికల్ హ్యాకింగ్ (Ethical Hacking) అంటే ఏంటి? అవసరమయ్యే స్కిల్స్, అందుబాటులో ఉన్న కోర్సులు, కెరీర్ గ్రోత్, జాబ్ రోల్స్ తదితర అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

* ఎథికల్ హ్యాకింగ్ అంటే?

ఇంటర్‌నెట్ అందరికీ చేరువకావడంతో హ్యాకింగ్ బెడద ఎక్కువైంది. ప్రముఖ సంస్థలు, వ్యక్తుల నెట్‌వర్క్‌‌ను హ్యాక్ చేస్తూ విలువైన సమాచారాన్ని దొంగలిస్తున్నారు. ఆన్‌లైన్ క్రిమినల్ యాక్టివిటీ పెరగడంతో ఎథికల్ హ్యాకర్స్‌కు డిమాండ్ బాగా పెరుగుతోంది. కంప్యూటర్ సిస్టమ్స్ సెక్యూరిటీని పెంచే విధానాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటారు.

* ఈ అంశాలపై ట్రైనింగ్

ఎథికల్ హ్యాకర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే సైబర్ ఎథిక్స్, హ్యాకింగ్ Google డేటాబేస్, సమాచార సేకరణ, పెనట్రేషన్ టెస్టింగ్, సాఫ్ట్‌వేర్ క్రియేషన్, కౌంటర్‌మెజర్స్ వంటి అంశాలపై శిక్షణ పొందాల్సి ఉంటుంది. వీటిపై ప్రస్తుతం అనేక సంస్థలు కోర్సులను అందిస్తున్నాయి. వైరస్ అనాలసిస్, ట్రోజన్స్, బ్యాక్‌డోర్స్, స్నిఫర్స్, కీలాగర్స్, IP స్పూఫింగ్, హనీపాట్స్, సోషల్ ఇంజినీరింగ్ తదితర అంశాలపై కోర్సుల్లో భాగంగా అవగాహన కల్పిస్తారు. SQL ఇంజెక్షన్, ఎక్స్‌ప్లోయిట్‌ రైటింగ్, సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీస్ వంటి వాటిల్లో ప్రాక్టికల్ స్కిల్స్ అలవర్చుకోవాలి.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్ అర్హతతో 7,914 రైల్వే జాబ్స్ .. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్

* కెరీర్ గ్రోత్

కంప్యూటర్ హ్యాకింగ్ ఘటనలు పెరుగుతుండడంతో ప్రముఖ బిజినెస్ సంస్థలు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఎథికల్ హ్యాకర్లను నియమించుకుంటున్నాయి. ఎథికల్ హ్యాకర్స్ ఈ సంస్థలకు చెందిన కంప్యూటర్ సిస్టమ్స్‌లోని వీక్ నెస్‌లు, పాజిబుల్ సెక్యూరిటీ హోల్స్ గుర్తించడం ద్వారా హ్యాకర్స్ దాడుల నుంచి కంప్యూటర్‌ను రక్షించడంలో కీలకంగా వ్యవహరిస్తారు.

2023 చివరి నాటికి ఎథికల్ హ్యాకర్స్‌కు గత ఏడాది కంటే 20 శాతం ఎక్కువ డిమాండ్ ఉంటుందని ఓ అంచనా ఉంది. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగనుంది. దీంతో మీరు ఎథికల్ హ్యాకింగ్‌ను కెరీర్ గా ఎంచుకుంటే జీవితంలో బాగా స్థిరపడవచ్చు.

* అవసరమైన స్కిల్‌సెట్

అద్భుతమైన ఎథికల్ హ్యాకర్‌గా ఎదగాలంటే విభిన్న రంగాలపై స్కిల్స్ ఉండాలి. ముఖ్యంగా సెక్యూరిటీ రీసెర్చ్, మల్లార్డ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్‌పై లోతైన అవగాహన… C++, పైథాన్, జావా, HTML తదితర వాటిల్లో కోడింగ్ నాలెడ్జ్… నెట్‌వర్కింగ్, రూటర్స్, ఫైర్‌వాల్స్‌ వంటి వాటిపై మెరుగైన స్కిల్స్ ఉండాలి. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్, అఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ (OSCP) సర్టిఫికేషన్, CompTIA, Security+, SANS GIAC, Cisco CCNA సెక్యూరిటీలో సర్టిఫికెట్స్ సాధిస్తే మంచి కంపెనీల్లో ఎథికల్ హ్యాకర్‌గా ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది.

* జాబ్ రోల్స్, జీతాలు

ఎథికల్ హ్యాంకింగ్‌లో అప్లికేషన్స్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్‌కు ప్రస్తుతం సగటు వార్షిక వేతనం రూ. 8.4లక్షలుగా ఉంది. సెక్యూరిటీ ఆడిటర్ కు సగటు వార్షిక వేతనం రూ. 11.1 లక్షలు, సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రోగ్రామర్‌గా సగటు వార్షిక వేతనం రూ. 6.3 లక్షలు, వెబ్ సెక్యూరిటీ మేనేజర్‌గా సగటు వార్షిక వేతనం రూ.15.87 లక్షలుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *