ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి.. చిన్న తప్పిదంతో గూగుల్‌కు పెద్ద దెబ్బ.. అదానీని మించి!

Google Bard: ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కరోజులోనే ఏకంగా 100 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ఇది భారత కరెన్సీలో ఏకంగా రూ.8 లక్షల కోట్లకుపైనే. గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన చాట్‌బాట్ ఒక ప్రమోషనల్ వీడియోలో తప్పుడు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ప్రమాదంలో పడటమే కాకుండా.. సంపద పెద్ద మొత్తంలో పతనమైంది. చిన్న తప్పిదానికి పెద్ద స్ట్రోక్ తగిలినట్లయింది. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇటీవల తీసుకొచ్చిన ChatGPT విజయవంతంగా దూసుకొచ్చిన వేళ గూగుల్ కూడా సరికొత్త చాట్‌బాట్‌ను ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.

అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీకి పోటీగా తీసుకొచ్చిన గూగుల్ ఏఐ చాట్‌బాట్ బార్డ్ (BARD) సరైన సమాచారం ఇవ్వలేకపోయింది. దీంతో ఆదిలోనే పెద్ద అంతరాయం కలిగింది. ఇదే ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణమైంది. దీంతో అల్ఫాబెట్ షేరు విలువ బుధవారం సెషన్‌లో ఒక దశలో 9 శాతానికిపైగా పడిపోయి.. చివరకు 7 శాతం నష్టంతో ముగించింది. అయితే.. మార్కెట్ విలువను మాత్రం ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేర కోల్పోయింది. ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.278 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

ఇటీవల అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ సంచలన రిపోర్ట్ నేపథ్యంలో.. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. అప్పుడు 10 రోజుల వ్యవధిలో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లు పడిపోయింది. కానీ అల్ఫాబెట్ మాత్రం ఒక్కరోజులోనే 100 బిలియన్ డాలర్లు నష్టపోవడం షాక్‌కు గురిచేస్తోంది.

పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్‌లో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే.. ఇదే మంచి సమయమా?

మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన చాట్‌‌బాట్ ChatGPTకి పోటీగా.. అల్ఫాబెట్ కూడా తన చాట్‌బాట్ బార్డ్‌ను (Bard) ఆవిష్కరించింది. దీని గురించి ఒక చిన్న వీడియోను GIF రూపంలో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కానీ అది తప్పుడు సమాచారం ఇచ్చింది. ఇది పారిస్‌లో చాట్‌బాట్ లాంచ్ ఈవెంట్‌కు కొద్దిగంటల ముందు జరగడం గమనార్హం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏం కనిపెట్టిందో చెప్పమంటే.. అది విభిన్న సమాధానాలిచ్చింది. ఇంకా సౌరవ్యవస్థ వెలుపల గ్రహాల చిత్రాలను తొలిసారిగా ఏ శాటిలైట్ చిత్రీకరించిందన్న ప్రశ్నకూ తప్పుడు సమాధానం ఇచ్చింది.

స్టార్టప్ కంపెనీ OpenAI ChatGPT ని నవంబర్‌లో లాంఛ్ చేసింది. దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఇందులో 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. అప్పటినుంచి గూగుల్‌పై ఒత్తిడి పెరిగింది. తన చాట్‌బాట్ కోసం సోమవారం ఒక యాడ్‌ను పోస్ట్ చేసింది. ట్విట్టర్‌లో దీనిని మిలియన్ల మంది చూశారు. ఇటీవల అల్పాబెట్ నాలుగో త్రైమాసిక ఫలితాలు కూడా నిరాశపరిచాయి.

Read Latest

Business News and Telugu News

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read:

ఏకంగా 96 శాతం పడిపోయిన అదానీ కంపెనీ లాభం.. మరీ రూ.9 కోట్లేనా?

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *