‘కశ్మీర్ ఫైల్స్’ చెత్త సినిమా : ప్రకాశ్ రాజ్

‘కశ్మీర్ ఫైల్స్’ చెత్త సినిమా : ప్రకాశ్ రాజ్ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరో వివాదానికి తెరలేపాడు. గతేడాది విడుదలై బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ‘కశ్మీర్‌ ఫైల్స్’పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేరళలో నిర్వహించిన మాతృభూమి ‘ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇన్ కేరళ’ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన.. కాశ్మీరీ ఫైల్స్ ఓ చెత్త సినిమా అని అన్నారు. అర్థంపర్థం లేని సినిమాల్లో అది కూడా ఒకటన్న ఆయన.. దాన్ని ఎవరు నిర్మించారో అందరికీ తెలుసని అన్నారు. అందుకే ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా దీన్ని పట్టించుకోలేదని చెప్పారు. తన సినిమాకు ఆస్కార్ ఎందుకు రాలేదని డైరెక్టర్ అంటున్నాడని అసలు ఆ మూవీకి ఆస్కార్ కాదు కదా.. భాస్కర్ కూడా రాదు అని సటైర్ వేశారు. ఈ ప్రాపగాండా ఫిల్మ్ కోసం కొందరు రూ.2000 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు తనకు తెలిసిన వాళ్లు చెప్పారని ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు.

1990లో కశ్మీరీ పండిట్స్‌ హత్యకాండను ఆధారంగా కాశ్మీరీ ఫైల్స్ సినిమాను తెరకెక్కించారు. ఆ కాలంలో కశ్మీరీ పండిట్స్ ఎదుర్కొన్న బాధలను ఈ చిత్రంలో చూపించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ కు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి, జీ స్టూడియోస్ సంయుక్తగా నిర్మించారు. 

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *