కేఏ పాల్ భద్రతపై డీజీపీకి హైకోర్టు ఆదేశాలు.. పాల్‌‌తో మామూలుగా ఉండదు మరి..!

తనకు సెక్యూరిటీని తొలిగించటంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే.. పోలీసులు తనని వేధిస్తున్నారని.. ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటున్నారని పిటిషన్‌తో పాల్ పేర్కొన్నారు. ఇటీవల నూతన సచివాలయం, గన్ పార్క్‌కు వెళ్లిన పాల్‌ను అడ్డుకున్నారు. కాగా.. ఇదే విషయంపై హైకోర్టును ఆశ్రయించగా.. సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం విచారించింది. కేఏ పాల్‌కు పొంచి ఉన్న ప్రమాదాన్ని పరిశీలించి 30 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే.. వాదనల సందర్భంగా కొత్త సచివాలయంలో జరిగిన ఫైర్ యాక్సిండెట్ ఘటన గురించి పాల్ ప్రస్తావించారు. కాగా.. అందుకు జీపీ అభ్యంతరం వ్యక్తం చేయటంతో.. ఆయన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా.. సచివాలయంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఘటనను కేఏ పాల్.. కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని పాల్ వాదించారు. ఘటన జరిగి వారం రోజులైనా కూడా ఇంతవరకు పోలీసులు ఫైర్ యాక్సిడెంట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని. అదే సచివాలయం నుంచి 10 మంది ముఖ్యమంత్రులు పాలన చేశారని పాల్ వెల్లడించారు. 500 కోట్ల భవనాన్ని కేవలం వాస్తు పేరుతో కూల్చేసి 660 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పాల్ ఆరోపించారు. సచివాలయం ప్రమాదంపై సీబీఐతో విచారణకు ఆదేశం ఇవ్వాలని ధర్మాసనానికి పాల్ విజ్ఞప్తి చేశారు.

ఇదంతా విన్న ప్రధాన న్యాయమూర్తి.. కేవలం తన భద్రతపైన మాత్రమే వాదించాలని.. ఇతర అంశాలు ఎందుకని సూచించారు. పాల్ భద్రతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్‌ను ధర్మాసనం ఆదేశించింది. అనంతరం.. పాల్ వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

97742810

Read More Telangana News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *