కొత్తగా కారు కొనే వారికి శుభవార్త.. రూ.70,000 తగ్గింపు!

Mahindra Offers | కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం సూపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ కార్ల (Cars) తయారీ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra) అదిరే ఆఫర్లు తీసుకువచ్చింది. ఏకంగా రూ. 70 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందిస్తోంది. బొలెరో, బొలెరో నియో, మారాజో, ఎక్స్‌యూవీ 300 వంటి మోడళ్లపై ఈ తగ్గింపు ఉంది. ఫిబ్రవరి నెల వరకే ఈ డీల్స్ లభిస్తాయి.

మహీంద్రా బొలెరో కారుపై ఏకంగా రూ. 70 వేల వరకు తగ్గింపు ఉంది. ఇందులో వేరియంట్ ప్రాతిపదికన ఆఫర్ కూడా మారుతుంది. ఈ సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ దుమ్మురేపుతోంది. ఇందులో 75 హెచ్‌పీ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్‌ను అమర్చారు. అలాగే మహీంద్రా బొలెరో నియో మోడల్‌పై అయితే రూ. 59 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందులో కూడా వేరియంట్ ఆధారంగా డిస్కౌంట్ మారుతుంది. ఈ కారులో 100 హెచ్‌పీ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌ అమర్చారు. టఫ్ రోడ్లపై కూడా ఈ ఎస్‌యూవీ సత్తా చాటగలదు.

అదిరే ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.16,000 తగ్గింపు!

ఇక మహీంద్రా మరాజో కారుపై అయితే రూ. 37 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఈ మల్టీ పర్పస్ వెహికల్‌లో వివిధ వేరియంట్లు ఉన్నాయి. వేరియంట్ ప్రాతిపదికన కూడా ఆఫర్‌లో మార్పు ఉంటుంది. కియా కరెన్స్, మారుతీ సుజుకీ ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది.

గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం, వెండి ధరలు, లేటెస్ట్ రేట్లు ఇలా

ఇక చివరిగా మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడల్‌పై అయితే రూ. 36,500 వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా పలు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. వేరియంట్ ప్రాతిపదికన ఆఫర్ మారుతుంది. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇకపోతే ఆఫర్లు అనేవి ప్రాంతం, డీలర్ షిప్ ప్రాతిపదికన కూడా మారుతూ ఉంటాయి. అందువల్ల మీరు కొత్తగా కారు కొనుగోలు చేయడానికి ముందు దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం. డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి అన్నీ కలిసి ఉంటాయి. వీటి ద్వారా తగ్గింపు వస్తుంది. కేవలం మహీంద్రా కార్లపై కాకుండా మారుతీ సుజుకీ, హోండా, టాటా మోటార్స్ వంటి కార్లపై కూడా తగ్గింపు అందుబాటులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *