ట్రాన్స్ జెండర్ జంటకు బేబీ పుట్టింది

ట్రాన్స్ జెండర్ జంటకు బేబీ పుట్టింది ఇది దేశంలోనే తొలిసారి

కోజికోడ్ : దేశంలోనే తొలిసారి కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ కపుల్​కు బేబీ పుట్టింది. ‘‘జహద్ ఉదయం 9:30 గంటలకు డెలివరీ అయింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ డాక్టర్లు సిజేరియన్ చేశారు. జహద్, బేబీ ఆరోగ్యంగా ఉన్నారు” అని జియా పావల్ తెలిపారు. అయితే పుట్టిన బిడ్డ ఆడా, మగా అనే విషయం చెప్పలేదు. కోజికోడ్​కు చెందిన జియా పావల్, జహద్ మూడేండ్లుగా కలిసి ఉంటున్నారు. తాము త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఈ జంట ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించింది. అందుకోసం హార్మోన్ థెరపీని వాయిదా వేసుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *