డ్రగ్స్‌లో కేసులో లోపలేసినా నాకు పోయేది లేదు.. మేం భీమవరం రాజులం: సుబ్బరాజు ఓపెన్ హార్ట్

2003లో ఖడ్గం సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన సుబ్బరాజు (Subba Raju) 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తు్న్నాడు. యాక్టింగ్‌లో ఇంటెన్స్ చూపించే ఈ నటుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ (Puri Jagannath)) సినిమాల్లో తప్పకుండా కనిపిస్తాడు. ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ వల్లనా ఏమో కానీ అతని సినిమాల్లో మాత్రం సుబ్బరాజుకు మంచి పాత్ర ఉంటుంది. అలాగే 2017లో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు (Drugs case) లో పూరీ జగన్నాథ్, చార్మీ, శ్యామ్ కె నాయుడు సహా పలువురిని దర్యాప్తు సంస్థ సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఇందులో సుబ్బరాజు కూడా ఉన్నాడు. తర్వాతి కాలంలో ఈ కేసు ఏమైందన్న సంగతి పక్కనబెడితే సుబ్బరాజు మాత్రం ఆ టైమ్‌లో డిప్రెషన్‌కు గురయ్యాడట. ఇందుకు సంబంధించిన విషయాలను తాజాగా ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (Open Heart with RK) టాక్ షోలో వెల్లడించాడు. ప్రస్తుతం విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమో వైరల్ అవుతోంది.

ప్రోమోలో భాగంగా సుబ్బరాజుతో చాలా విషయాలపై ముచ్చటించిన రాధాకృష్ణ.. డ్రగ్స్ కేసులో డిస్టర్బెన్స్ గురించి అడిగారు. అయితే ఈ విషయంలో తనకు జరిగే డ్యామేజ్ కంటే పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారనే బాధపడ్డానని, వాళ్లకు ఏం చెప్పి ధైర్యం చెప్పాలని సతమతమైనట్లు చెప్పాడు సుబ్బరాజు. ఎందుకంటే వాళ్లు బయటికెళ్లి చెప్పకపోయినా.. తలుపుకొట్టి మరీ మీ అబ్బాయి ఇలా అంట కదా! అని అడిగే సొసైటీ కదా మనదని సెటైర్ వేశాడు. ఇంతకీ ఏ గ్రౌండ్ మీద మిమ్మల్ని పిలిచారని మీరు అడగలేదా? అంటే.. ఒకవేళ ఏదో కారణం చెప్పి లోపల పడేసినా నాకు పోయేదేం ఉండదని ఆన్సర్ ఇచ్చాడు సుబ్బరాజు. అదేంటని ఆర్కే ప్రశ్నిస్తే.. ఏం చేస్తాం మరి, దీనికేమైనా చేశామా అని నవ్వేశాడు.

ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగాలంటే ముందు ఫిట్‌గా ఉండాలని.. ఆ తర్వాత ఏది వస్తే అది చేసుకుంటూ పోవాలన్నారు సుబ్బరాజు. తన తండ్రి భీమవరం డీఎన్‌ఆర్ కాలేజీలో లెక్చరర్‌గా ఉండటంతో కొంచె డిసిప్లిన్‌గా పెరిగినట్లు చెప్పుకొచ్చారు. గర్ల్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చాడు. ‘ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటి? రాంగోపాల్ వర్మను ఏమైనా ఆదర్శంగా తీసుకున్నారా’ అని ఆర్కే అడిగితే.. కేవలం కోరికలతో పెళ్లి చేసుకోకూడదని వద్దనుకున్నట్టుగా తెలిపాడు.

వేరొకరి డబ్బుతో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి భయపడి తాను హీరోగా ట్రై చేయలేదని ఈ సందర్భంగా సుబ్బరాజు పేర్కొన్నాడు. ఇది కాకపోతే ఇంకో పని చేద్దామనే మైండ్ సెట్‌తోనే నటుడిగా కంటిన్యూ అవుతున్నట్లు తెలిపాడు. మరి త్రివిక్రమ్, పూరీ లాంటి స్టార్ డైరెక్టర్లను మంచి మంచి క్యారెక్టర్లకు అడగలేదా అంటే.. అడక్కూడదనేదే తన స్వభావమని తేల్చేశాడు. దీనికి రాజులు కదా! అని కౌంటర్ ఇచ్చాడు ఆర్కే. ఇక భీమవరం రాజుల గురించి ప్రస్తావిస్తూ.. ‘రొయ్యలు, పీతలు బాగా తింటారు. కోడి పందేలు, పేకాట ఆడతారు’ అనే పేరు ఉందని చెప్పుకొచ్చాడు సుబ్బరాజు. ఈ ఫుల్ ఎపిసోడ్ ఆదివారం రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానుంది.

Read Latest

Tollywood updates and

Telugu news

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *