Telangana MLC Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎన్నికల వేడి మెుదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ ( Member of Legislative Council) స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాకి షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23 కాగా.. నామినేషన్లను ఫిబ్రవరి 24న పరిశీలిస్తారు. ఫిబ్రవరి 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ జరపనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో పేర్కొంది.
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి పదవీకాలం 2023 మార్చి 29న ముగియనుంది. ఆయనతో పాటు ప్రస్తుతం హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సయ్యద్ అస్సాన్ జాఫ్రీ పదవి కాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉండటం, తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లనున్నాడనే ఊహాగానాల నేపథ్యంలో ఈ ఎన్నికలును అన్ని పార్టీలను సీరియస్‌గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈసారి టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఈ ఎన్నిక మరిత ఆసక్తిగా మారనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీ కాలంలో దగ్గరపడుతుండంటంతో అన్ని పార్టీల ఆశావాహులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల విధుల్లో విధుల్లో ఉపాధ్యాయులే కీలకం కావటంతో అన్ని పార్టీలూ వారిని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే అధికార పార్టీ బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.
ఇటు ఏపీలోనూ ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం 13 ఎమ్మెల్సీ సీట్లకు షెడ్యూల్ విడుదల చేసింది. 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువరించింది.
97754119
Read More Telangana News And Telugu News