భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు ప్రారంభమైన తొలి టెస్టుపై మొదటి రోజే ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఐదు నెలల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జడేజా 5 వికెట్లు పడగొట్టి హీరోగా మారిపోయాడు. ఆస్ట్రేలియా టీమ్ కేవలం అశ్విన్ బౌలింగ్‌ని ఎదుర్కోవడం శ్రద్ధ పెట్టి జడ్డూ బౌలింగ్‌లో బోల్తా కొట్టిందని అభిప్రాయపడుతున్న నెటిజన్లు.. ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్‌లో జడ్డూ ఔటాఆఫ్ సిలబస్ అంటూ జోక్‌లు వేస్తున్నారు.
జడేజా బెస్ట్ బాల్ వేసినప్పుడు వెల్ అంటూ పొగుడుతూ ఉత్సాహంగా బొటనవేలు చూపించిన స్టీవ్‌స్మిత్.. గ్రేట్ బాల్ వేయగానే బోర్లాపడ్డాడంటూ సెటైర్స్ వేస్తున్నారు. అలానే స్పిన్నర్ల నుంచి ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా భయపడితే తొలి రెండు వికెట్లనీ అది కూడా బ్యాక్ టు బ్యాక్ ఓవర్లలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తీయడంపై కూడా అభిమానులు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
రవీంద్ర జడేజా గత ఐదు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉండటానికి గాయం ఒక కారణమైతే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కూడా మరో కారణమని ఇటీవల విమర్శలు వచ్చాయి. జడేజా భార్య బీజేపీ ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేసింది. దాంతో ఆమె తరఫున ప్రచారంలో పాల్గొన్న జడేజా.. భార్యని గెలిపించుకున్నాడు. దాంతో కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించగా.. తాజాగా 5 వికెట్లు పడగొట్టి వారికి గట్టిగా బదులిచ్చేశాడని ఫ్యాన్స్ సరదాగా మీమ్స్ తయారు చేసి షేర్ చేస్తున్నారు.
తొలి టెస్టులో ఈరోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 77/1తో నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. కేఎల్ రాహుల్ మాత్రం 20 పరుగులకే ఔటైపోయాడు. అంతకముందు ఆస్ట్రేలియా టీమ్ 177 పరుగులకి ఆలౌటైంది. జడేజా ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, షమీ, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు.
Read Latest
Sports News
,
Cricket News
,