బాడీ క్లీన్​గా పెట్టుకోకపోవడం ‘‘డిమెన్షియా’’

బాడీ క్లీన్​గా పెట్టుకోకపోవడం ‘‘డిమెన్షియా’’ ఇంటి నుంచి బయటికెళ్లినప్పుడు ప్రతీ ఒక్కరు పది మందిలో స్మార్ట్​గా కనిపించాలనుకుంటారు. ఇస్త్రీ చేసిన డ్రెస్.. ఫేస్​కు క్రీమ్ పెట్టుకుని అందంగా రెడీ అవ్వాలనుకుంటారు. స్నానం చేయకుండా గలీజ్ డ్రెస్ వేసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లాలనుకోరు. ఒకే డ్రెస్ నెల రోజులు వేయడం, వారాల తరబడి స్నానం చేయకపోవడం.. బాడీ క్లీన్​గా పెట్టుకోకపోవడం చేస్తుంటే వారు ‘‘డిమెన్షియా’’ డిసీజ్ బారినపడినట్లే. ఇవన్నీ వ్యాధి ప్రాథమిక లక్షణాలు అని యూఎస్​కు చెందిన నేషనల్​ ఇన్​స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ (ఎన్ఐఏ) అభిప్రాయపడింది. వ్యాధి ముదిరితే బాడీపై కంట్రోల్​ కోల్పోతారని, ఇతరుల సాయం లేకుండా ఏమీ చేయలేరని హెచ్చరిస్తున్నారు. ముందే డిసీజ్ గుర్తించి చికిత్స తీసుకుంటే క్యూర్ అవుతారని ఎన్ఐఏ రీసెర్చర్స్​ సూచిస్తున్నారు. –

ఇంటి నుంచి బయటికెళ్లినప్పుడు ప్రతీ ఒక్కరు పది మందిలో స్మార్ట్​గా కనిపించాలనుకుంటారు. ఇస్త్రీ చేసిన డ్రెస్.. ఫేస్​కు క్రీమ్ పెట్టుకుని అందంగా రెడీ అవ్వాలనుకుంటారు. స్నానం చేయకుండా గలీజ్ డ్రెస్ వేసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లాలనుకోరు. ఒకే డ్రెస్ నెల రోజులు వేయడం, వారాల తరబడి స్నానం చేయకపోవడం.. బాడీ క్లీన్​గా పెట్టుకోకపోవడం చేస్తుంటే వారు ‘‘డిమెన్షియా’’ డిసీజ్ బారినపడినట్లే. ఇవన్నీ వ్యాధి ప్రాథమిక లక్షణాలు అని యూఎస్​కు చెందిన నేషనల్​ ఇన్​స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ (ఎన్ఐఏ) అభిప్రాయపడింది. వ్యాధి ముదిరితే బాడీపై కంట్రోల్​ కోల్పోతారని, ఇతరుల సాయం లేకుండా ఏమీ చేయలేరని హెచ్చరిస్తున్నారు. ముందే డిసీజ్ గుర్తించి చికిత్స తీసుకుంటే క్యూర్ అవుతారని ఎన్ఐఏ రీసెర్చర్స్​ సూచిస్తున్నారు. –

– సెంట్రల్​డెస్క్​, వెలుగు

మెమొరీ లాస్​ అనేది.. అల్జీమర్స్, డిమెన్షియా (రోజువారీ పనులు మర్చిపోవడం) డిసీజెస్​ ప్రారంభ లక్షణాలు అని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆన్ ఏజింగ్​ (ఎన్​ఐఏ) అభిప్రాయపడింది. పరిశుభ్రత పాటించకపోవడం, స్నానం చేయకపోవడం, గలీజ్ బట్టలు వేసుకోవడం వంటివి మైల్డ్ అల్జీమర్స్ లక్షణాలని ఎన్​ఐఏ తేల్చింది. ఏ విషయాన్ని సరిగ్గా జడ్జ్​ చేయకపోవడంతో పాటు మూడ్​ చేంజ్​ అవుతుండటం వంటి కొన్ని కీలక లక్షణాలతో కూడిన జాబితాను ఎన్​ఐఏ రిలీజ్​ చేసింది. దీనికితోడు తన బాడీ క్లీనింగ్​పై  కేరింగ్​ చూపకపోవడం, అందంగా కనిపించాలనే ఆలోచన రాకపోవడం వంటివి డిమెన్షియా లక్షణాలుగా తెలిపింది. స్నానం చేయకపోవడం, డెయిలీ ఒకే డ్రెస్​ వేసుకోవడం కూడా ఈ వ్యాధి కిందికే వస్తుందని ఎన్​ఐఏ తెలిపింది. 

డిసీజ్​ ముదిరితే..

తన బట్టలు గలీజ్​గా ఉన్నాయనే విషయం కూడా డిమెన్షియా పేషంట్ తెలుసుకోలేకపోతాడని 2018లో జరిపిన స్టడీలో వెల్లడైంది. డ్రెస్​పై మరకలు, భోజనం పడి వాసన వస్తున్నా వాటిని మార్చుకోవాలనే ఆలోచనే వారికి రాదని తేలింది. అస్సలు పర్సనల్​ కేర్​ తీసుకోకపోవడం డిమెన్షియా పేషెంట్ ప్రాథమిక లక్షణాల్లో ఒకటి. వ్యాధి ముదురుతూ ఉంటే టాయిలెట్ చేయడం కూడా మర్చిపోతారు. ప్యాంటులోనే మూత్రం పోసుకునే పరిస్థితికి వస్తారు. మలమూత్రాలతో తమను తాము గలీజ్​ చేసుకుంటారు. అల్జీమర్స్ బారినపడిన వారు డిప్రెషన్​ లాంటి ‘‘మూడ్​ డిజాస్టర్”తో కూడా బాధపడుతుంటారు. 

డిమెన్షియా అంటే ఎమిటి?

డిమెన్షియా అనేది న్యూరో డీ జనరేటివ్​ కండిషన్​. దీని బారినపడితే జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తితో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి తగ్గిపోతుంది. రోజువారీగా చేసే పనులు కూడా మరిచిపోతుంటారు. చివరికి వారిపై వారే నియంత్రణ కోల్పోతారు. ఇతరులపై ఆధారపడాల్సి పరిస్థితి వస్తుంది. మొత్తం ఏడు స్టేజీలు ఉండగా.. ప్రతీ స్టేజ్​లో వేర్వేరు లక్షణాలు ఉంటాయి. ఒక పేపెంట్​ ఎంత కాలం ఒక స్టేజ్​లో ఉంటాడో చెప్పలేం. అల్జీమర్స్​ డిసీజ్​లో ‘అగ్నోసియా’ కామన్. ఇది అల్జీమర్స్​కి చెందిన నాల్గో హ్యూరిస్టిక్​కు (స్మృతి, అఫాసియా, అప్రాక్సియా, అగ్నోసియా) చెందినది. డిమెన్షియాలో ఐదో స్టేజ్​ను ‘మోడరేట్లీ సీవియర్​ కంజిటివ్​ డిక్లెయిన్’ అంటాం. ఈ స్టేజ్​లో పేషంట్​ స్నానం చేయడం, మంచి బట్టలు వేసుకోవడం, రోజూ చేయాల్సిన పనులు మరిచిపోతుంటాడు. దీనికోసం ఎవరో ఒకరు హెల్ప్​ చేయాల్సి ఉంటుంది. 

అల్జీమర్స్​లోనూ అవే సిమ్​టమ్స్​

స్నానం చేయకపోవడం, గలీజ్​ బట్టలు వేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం డిమెన్షియా మేజర్​ సిమ్​టమ్స్​గా చెప్పుకోవచ్చని ఎన్​ఐఏ పరిశోధకులు అంటున్నారు. తీవ్రత పెరిగేకొద్దీ వారి శరీరంపై కంట్రోల్​ కోల్పోతారు. ఎవరేం చెప్పినా.. చేయలేకపోతారు. కండ్లు, ముక్కు, చెవులు వంటి అవయవాలపై నియంత్రణ ఉండదు. డిమెన్షియా బారినపడిన రెండు, మూడు ఏండ్ల మధ్య పేషెంట్స్​లో ఈ లక్షణాలు చూడొచ్చు. అల్జీమర్స్​తో బాధపడేవారిలో కూడా మంచి డ్రెస్​ వేసుకోవాలన్న ఇంట్రెస్ట్​ తగ్గిపోతుందని న్యూరాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. అందంగా కనిపించాలనే కోరిక తగ్గిపోతుంది. 

   

డిమెన్షియా లక్షణాలు

  •  చాలా తొందరగా అప్​సెట్​ కావడం, చిన్న చిన్న వాటిపై కోప్పడటం.
  •  డిప్రెషన్​లోకి వెళ్లిపోవడం,  ఏ విషయంపై ఇంట్రెస్ట్​ లేకపోవడం
  •  కొన్ని విషయాలు, వస్తువులు దాచిపెట్టడం
  •  లేని వాటిని ఊహించుకోవడం, ఇంటికి దూరంగా గడపడం
  •  తనను తాను, ఇతరులను కొట్టడం
  •  అసాధారణ లైంగిక ప్రవర్తన
  •  చూసింది లేదా విన్నది తప్పని అర్థం చేసుకోవడం

  ©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *