మళ్లీ పెళ్లి చేసుకున్న శేఖర్ మాస్టర్.. బోరున ఏడ్చిన శ్రద్ధా దాస్.. ఎమోషన్ వేరే లెవల్!

‘ఢీ-15’ ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. అటు డ్యాన్స్‌తో పాటు ఇటు ఎంటైన్‌మెంట్‌ను కూడా అందిస్తుంది ఈ షో. లేటెస్ట్ ప్రోమో మాత్రం ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటోంది. లవర్స్ డే (ఫిబ్రవరి 14) కోసం లవ్ థీమ్‌పై కంటెస్టెంట్లు డ్యాన్స్ చేశారు. అయితే ఇందులో ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చారు కంటెస్టెంట్లు.

మాస్టర్‌కు మళ్లీ పెళ్లి

ప్రోమోలో ఫస్ట్ కంటెస్టెంట్.. ‘గీత గోవిందం’ సినిమాలోని “తెల్లతెల్లవారి వెలుగు రేఖలా” సాంగ్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అయితే లిరిక్స్‌లో భాగంగా “వచ్చిందమ్మా వచ్చిందమ్మా” అంటూ ప్లే అవుతుండగా స్టేజ్‌పైకి శేఖర్ మాస్టర్ భార్య వచ్చేసింది. ఇది చూసి మాస్టర్ అవాక్కయ్యాడు. కొంచెం ఎమోషనల్ అయిన శేఖర్ మాస్టర్.. తన భార్యను దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టాడు. తర్వాత ఇద్దరూ దండలు మార్చుకోగా.. యాంకర్ ప్రదీప్ సహా కంటెస్టెంట్లు వాళ్లపై పూలు జల్లారు. శేఖర్ మాస్టర్‌ను ఇంట్లో ‘నాని’ అని పిలుస్తారని అతని భార్య చెప్పింది.

97755275

ఏడ్చేసిన శ్రద్ధా దాస్

ఇక తర్వాత మరో లేడీ కంటెస్టెంట్.. “తెలుసునా తెలుసునా” అంటూ సొంతం సాంగ్‌కు డ్యాన్స్ వేసింది. సర్‌ప్రైజ్‌గా ఆమెతో పాటు యాంకర్ ప్రదీప్ కూడా కాలుకదిపాడు. ఇది చూసిన జడ్జి శ్రద్ధా దాస్.. “ప్రదీప్ అక్కడ డ్యాన్స్ చేస్తుంటే వేరే అమ్మాయితో పాటు.. ప్రతి అమ్మాయికి జలస్ వస్తుంది” అని సిగ్గుపడింది. ఇక చివర్లో మరో కంటెస్టెంట్ ” ఏ నోము నోచిందో.. ఏ పూజ చేసిందో.. పరమేశ నిను కన్న తల్లి” అంటూ యోగి చిత్రంలో పాటకు ఎమోషనల్‌‌గా డ్యాన్స్ చేశారు. ఈ పెర్ఫామెన్స్ చేస్తున్నప్పుడు వెనుక స్క్రీన్‌లో శేఖర్ మాస్టర్ తన తల్లితో ఉన్న ఫొటోను.. అలాగే శ్రద్ధా దాస్ తన అమ్మ, నాన్నలతో ఉన్న చిన్నప్పటి ఫొటోలను ప్లే చేశారు. ఇది చూసి శేఖర్ మాస్టర్, శ్రద్ధా ఎమోషనల్ అయ్యారు. శ్రద్ధా అయితే “అది నాకు చాలా ఇష్టమైన ఫొటో.. నేను చాలా ఎమోషనల్ అయ్యాను” అంటూ ఏడ్చింది.

అమ్మతో డ్యాన్స్

ఇక ప్రోమో ఎండింగ్ మాత్రం చాలా హైలెట్‌గా ఉంది. అమ్మ పాటకు డ్యాన్స్ చేసిన కంటెస్టెంట్ తల్లి స్టేజిపైకి వచ్చారు. చాలా ఎమోషనల్ అయ్యారు. శేఖర్ మాస్టర్.. స్టేజిపైకి రాగా.. అదే పాటకు ఆ తల్లితో కలిసి శేఖర్ మాస్టర్ డ్యాన్స్ చేశారు. ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. “‘వాలంటైన్స్ డే’ అంటే కేవలం అమ్మాయి- అబ్బాయి మధ్య ఉండే ప్రేమ మాత్రమే కాదు.. తల్లి-బిడ్డల ప్రేమ కూడా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఢీ-15 ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest TV News and Movie Updates

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *