మహ్మద్ షమీ దెబ్బకి గాల్లో ఆఫ్ స్టంప్ గింగిరాలు.. నోరెళ్లబెట్టిన డేవిడ్ వార్నర్‌

David Warner Bowled: నాగ్‌పూర్ (Nagpur) వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కి అదిరిపోయే ఆరంభం లభించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లని ఓవర్ వ్యవధిలో భారత ఫాస్ట్ బౌలర్లు పెవిలియన్ బాట పట్టించారు. మ్యాచ్‌లో తాను వేసిన మొదటి ఓవర్‌లోనే ఉస్మాన్ ఖవాజా (1)ని ఎల్బీడబ్ల్యూగా మమ్మద్ సిరాజ్ ఔట్ చేసేశాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన మహ్మద్ షమీ (Mohammed Shami) మొదటి బంతికే డేవిడ్ వార్నర్‌(1)ని క్లీన్ బౌల్డ్ చేశాడు.

మూడో ఓవర్ వేసిన మహ్మద్ షమీ గంటకి 138 వేగంతో ఫస్ట్ బాల్‌ని విసిరాడు. వాస్తవానికి లెంగ్త్ డెలివరీ పడటంతో డేవిడ్ వార్నర్ హిట్ చేస్తాడని అంతా ఊహించారు. కానీ.. కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్లు రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేస్తే గత మూడేళ్లుగా ఒత్తిడిలో కనిపిస్తున్న డేవిడ్ వార్నర్ వేగంగా షాట్ ఎంపికపై ఓ క్లారిటీకి రాలేకపోయాడు. దాంతో తొలుత అతని ఫ్యాడ్స్‌ని తాకిన బంతి అనంతరం వెళ్లి ఆఫ్ స్టంప్‌ని గీరాటేసింది. బంతి తగిలిన వేగానికి ఆఫ్ స్టంప్‌ గాల్లో గింగిరాలు తిరుగుతూ వెళ్లి కీపర్‌కి సమీపంలో పడింది.

వాస్తవానికి 2019 యాసెష్ సిరీస్ సమయంలో ఇలానే డేవిడ్ వార్నర్‌ని స్టువర్ట్ బ్రాడ్ బోల్తా కొట్టించాడు. ఆ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ క్రీజులో ఉన్నంతసేపు రౌండ్ ది వికెట్‌ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దాంతో నాగ్‌పూర్ టెస్టులోనూ అదే ప్లాన్‌ని మహ్మద్ షమీ అమలు చేసి సక్సెస్ అయ్యాడు. బంతి ఫ్యాడ్, బ్యాట్‌కి మధ్యలో నుంచి వెళ్లిన తీరుకి డేవిడ్ వార్నర్ నోరెళ్లబెడుతూ కనిపించాడు. మహ్మద్ షమీ మాత్రం ఈ వికెట్‌కి బాగా ఎంజాయ్ చేశాడు. గాల్లోకి పంచ్‌లు విసురుతూ సంబరాలు చేసుకున్నాడు.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *